Pushpa 2 (Pushpa 2: The Rule) Movie Audio Rights Sold For A Whopping Amount, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa The Rule: భారీ ధరకు పుష్ప-2 ఆడియో రైట్స్.. ఆ రెండు సినిమాలను మించి!

Published Thu, May 4 2023 7:35 AM | Last Updated on Thu, May 4 2023 8:51 AM

Allu Arjun Pushpa The Rule Movie Audio Rights Sold For Huge Amount - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'పుష్ప- ది రూల్.' ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో రిలీజైన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే బన్నీ బర్త్‌డే  సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా పుష్ప-2 మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ)

'పుష్ప- పార్ట్‌-1 బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప-2కు అదేస్థాయిలో పోటీ నెలకొంది. పుష్ప ది రైజ్ బీజీఎం, సాంగ్స్​ ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. పుష్ప- ది రూల్ అంతకుమించి ఉండనుండడంతో ఆడియో హక్కుల కోసం పోటీ మరింత పెరిగింది. 'టీ సిరీస్' రూ.65 కోట్లకు మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లెక్కల ప్రకారం బాహుబలి-2​, ఆర్​ఆర్ఆర్​ సినిమాల మ్యూజిక్​ రైట్స్​ కంటే ఇది అత్యధికం కానుంది. దీంతో మరోసారి పుష్పరాజ్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.   

ఈ క్రమంలో ఆడియో హక్కులకే ఈ స్థాయిలో అమ్ముడైతే ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయోనని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్​, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సంగీతమందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

(ఇది చదవండి: రాత్రి ఓ యువకుడు ఏకంగా బాల్కనీలోకి దూకేశాడు: ప్రియాంక చోప్రా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement