Audio rights
-
'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'పుష్ప- ది రూల్.' ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో రిలీజైన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా పుష్ప-2 మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఆడియో రైట్స్‌ను టీ-సిరీస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ) 'పుష్ప- పార్ట్-1 బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప-2కు అదేస్థాయిలో పోటీ నెలకొంది. పుష్ప ది రైజ్ బీజీఎం, సాంగ్స్ ఓ రేంజ్లో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. పుష్ప- ది రూల్ అంతకుమించి ఉండనుండడంతో ఆడియో హక్కుల కోసం పోటీ మరింత పెరిగింది. 'టీ సిరీస్' రూ.65 కోట్లకు మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లెక్కల ప్రకారం బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాల మ్యూజిక్ రైట్స్ కంటే ఇది అత్యధికం కానుంది. దీంతో మరోసారి పుష్పరాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆడియో హక్కులకే ఈ స్థాయిలో అమ్ముడైతే ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయోనని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సంగీతమందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. (ఇది చదవండి: రాత్రి ఓ యువకుడు ఏకంగా బాల్కనీలోకి దూకేశాడు: ప్రియాంక చోప్రా) "అర్జునుడి" రికార్డుల వేట ఆరంభం!!! 🛐🔥#Pushpa2TheRule audio rights sold for 65Crs.This is ALL TIME RECORD price for any Indian film by double margin.@alluarjun 👑(previous #RRR -26c) pic.twitter.com/b52dEmwwKp — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) May 2, 2023 -
ఆ బడా కంపెనీలకే ఆర్ఆర్ఆర్ ఆడియో రైట్స్
RRR Movie Audio Rights: 'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్లో లెక్కలు మారిపోయాయి. తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద మోజు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, పుష్ప, ఆర్ఆర్ఆర్, లైగర్ సహా పలు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే. అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కోట్లలోనే జరుగుతోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్, టీ సిరీస్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాయి. Glad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s @RRRMovie 🤩🔥🌊 An @MMKeeravaani Musical 🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari#BhushanKumar #TSeries @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @PenMovies pic.twitter.com/w59F9XlmD5 — T-Series (@TSeries) July 26, 2021 ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ పాటలను లహరి, టీ సిరీస్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆడియో రైట్స్ ద్వారా ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు రూ.25 కోట్లు ముట్టినట్లు సమాచారం. సుమారు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాకు మొత్తంగా రూ. 900 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఫిల్మీదునియాలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కేవలం ప్రీరిలీజ్ బిజినెస్‌తోనే లాభాలందుకుంటోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కాసులు కురిపిస్తుందో చూడాలి! -
శీతాకాలం ప్రేమ
సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగÔó ఖర్ మూవీస్ బ్యానర్‌పై భావన, రవి నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఆడియో హక్కులను కర్ణాటకకు చెందిన ఆనంద్ ఆడియో సంస్థ 75లక్షలకు సొంతం చేసుకుంది. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగశేఖర్ మాట్లాడుతూ –‘‘సత్యదేవ్, తమన్నా కాంబినేసన్ అనగానే ట్రేడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. మా చిత్రం టైటిల్ విన్నవారంతా ప్రేమకథలు శీతాకాలంలోనే మొదలవుతాయని, తమ ప్రేమకథలను గుర్తు చేసుకుంటున్నారు. టైటిల్ పొయెటిక్‌గా ఉంది అంటుంటే ఆనందంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య హెగ్డే, లైన్ప్రొడ్యూసర్స్: సంపత్‌కుమార్, శివ్దశ్ యశోదర. -
ఐసీసీ వరల్డ్‌కప్ : ఆ వెబ్సైట్లకు, రేడియో ఛానెళ్లకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్‌కప్ 2019ల మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆడియో ప్రసారం చేస్తున్న సుమారు 60 వెబ్సైట్లు, రేడియో ఛానెళ్లకు షాక్ ఇచ్చింది. ఛానెల్-2 గ్రూప్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీటి ఆడియో సేవలను ప్రసారం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జేఆర్ మిథా నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. అంతేకాదు దీనిపై సమాధానం ఇవ్వాలంటూ సంబంధిత వెబ్సైట్లకు, రేడియో ఛానెళ్లకు, ఇంటర్నెట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు ఇంటర్నెట్, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సంబంధిత వెబ్సైట్లకు సంబంధించిన లింకులను తొలగించాలని సూచించింది. సన్నాహక మ్యాచ్‌లతో సహా మ్యాచ్‌లకు సంబంధించిన ఆడియోను ప్రసార హక్కులను పొందిన గ్రూప్ 2 ఛానల్ తమ ప్రత్యేకమైన, మేధో సంపత్తి హక్కులను కొన్ని వెబ్సైట్లు, రేడియో ఛానళ్లు దుర్వినియోగం చేశాయని ఆరోపించింది. తద్వారా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోందని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యూఏఈ ఆధారిత సంస్థ ఛానల్ 2 గ్రూప్ ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ నుంచి 2023 వరకు ప్రత్యేక గ్లోబల్ ఆడియో హక్కులను కొనుగోలు చేసింది. ప్రత్యేకమైన ఆడియో హక్కులను కలిగి ఉన్నప్పటికీ, ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌కాస్టర్ హాట్‌స్టార్‌కి అధికారికపార్టనర్గా ఉంది. ఐసీసీ క్రికెట్ కౌన్సిల్‌కు చెందిన వాణిజ్య సంస్థ ఐసీసీ బిజినెస్ కార్పోరేషన్‌తో కొన్ని సంవత్సరాల క్రితం ఆడియో హక్కుల ఒప్పందంపై సంతకాలు చేసింది. మే 30న మొదలైన ప్రపంచకప్ 2019 జులై 14 వరకు జరగనున్నసంగతి తెలిసిందే -
క్రేజ్‌కు క్రేజు! క్యాష్కు క్యాష్!
‘దిల్వాలే’ సినిమాలో హైలైట్ ఎవరు? అంటే టక్కున వచ్చే సమాధానం షారుక్ ఖాన్-కాజోల్. ఇప్పటివరకూ వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఆరు. కానీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో ఈ జంట మధ్య పండిన కెమిస్ట్రీ , ఆ సినిమా చేసిన మాయ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి వస్తున్న చిత్రం ‘దిల్వాలే’. ఈ నెల 18న రిలీజ్ కానున్న ఈ సినిమా మీద అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం... * శాటిలైట్ హక్కులు 60 కోట్లు! * ఆడియో రైట్స్19 కోట్లు! * 22 ఏళ్ల క్రితం ‘బాజీగర్’ కోసం తొలిసారి జతకట్టారు షారుక్ ఖాన్, కాజోల్. ఆ చిత్రంతోనే జంట బాగుందనిపించుకున్నారు. ఇక, ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకూ అరడజను చిత్రాల్లో జంటగా నటించి, తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మాయ చేశారు. అందుకే షారుక్, కాజోల్ ఓ చిత్రంలో జంటగా నటిస్తున్నారంటే ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. తాజా చిత్రం ‘దిల్వాలే’పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. * ఐదేళ్ల క్రితం షారుక్ సరసన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’లో నటించిన కాజోల్ ఆ తర్వాత ఈ హీరోగారితో జతకట్టిన చిత్రం ‘దిల్వాలే’. వాస్తవానికి చిత్రదర్శకుడు రోహిత్‌శెట్టి ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు, ఎక్కువ శాతం షూటింగ్ విదేశాల్లో ఉండటంవల్ల కాజోల్ చేయకూడదనుకున్నారు. కానీ, కాజోల్ కూతురు నైసా ‘మమ్మీ.. నువ్వీ సినిమా కచ్చితంగా చేయాల్సిందే. ఎక్కువ సినిమాల్లో నువ్వు ఏడవడం చూశాను. ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నువ్వు నవ్వడం చూడాలి’ అనడంతో కాజోల్ నవ్వుతూ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. * ఇది రొమాంటిక్ యాక్షన్ కామెడీ మూవీ. ఇందులో షారుక్ ‘కార్ మాడిఫైర్’గా చేశారు. అండర్ కరెంట్‌లో గ్యాంగ్‌స్టర్ అని సమాచారం. షారుక్ తమ్ముడిగా వరుణ్ ధావన్ నటించారు. వరుణ్‌కు జోడీగా కృతీసన న్ నటించగా, మరో కీలక పాత్రను బొమన్ ఇరానీ చేశారు. * షారుక్, కాజోల్‌ల సూపర్ హిట్ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ (డీడీఎల్‌జె)లో ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆ సీక్వెన్స్‌ని ఆదర్శంగా తీసుకుని పలువురు దర్శకులు ఆ తరహా సన్నివేశాన్ని తమ చిత్రాల్లో జోడించారు. ‘దిల్వాలే’లో కూడా ‘డీడీఎల్‌జె’ తరహా ట్రైన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు రోహిత్. మరి.. ఈ సీక్వెన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. * గత నెల 9న విడుదలైన ఈ ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటివరకూ దాదాపు కోటీ 70 లక్షల మంది ట్రైలర్‌ను వీక్షించారు. * ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. హిట్ పెయిర్ షారుక్, కాజోల్ జంటగా నటించిన చిత్రం కావడంతో పలు ప్రముఖ టీవీ ఛానల్స్ శాటిలైట్ హక్కులు దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. ఈ పోటీని నిర్మాత చక్కగా క్యాష్ చేసుకున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఏకంగా రూ. 60 కోట్లకు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటివరకూ ఏ చిత్రానికి ఇంత ధర పలకలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. * మ్యూజిక్ రైట్స్ పరంగా కూడా రెడ్ చిల్లీస్కి భారీ మొత్తమే దక్కిందట. సోనీ మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను 19 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుందని భోగట్టా. * ఈ చిత్రంలోని ‘గేరువా...’ ప్రోమో సాంగ్‌ను ముంబైలోని మరాఠా మందిర్‌లో విడుదల చేశారు. ‘డీడీఎల్జే’ ఇక్కడే 20 ఏళ్ల పాటు ఆడిన విషయం తెలిసిందే. ఈ పాటను ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించారు. మైనస్ డిగ్రీల చలిలో షారుక్-కాజోల్ మధ్య ఏడు రోజుల పాటు తీశారు. ఈ పాట మొత్తం బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుందట. ఈ పాటకు సంబంధించిన ఓ దృశ్యంలో ఒక ధ్వంసమైన విమానం కనిపిస్తుంది. అది సెట్ అని ప్రోమో చూసినవాళ్లు భావించారు. కానీ అది నిజమైన విమానమే అట. ఐస్‌ల్యాండ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ధ్వంసమైన విమానం అది. ఆ త ర్వాత దాన్ని ఓ టూరిస్ట్ స్పాట్‌గా ఆ దేశ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. * రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌ను అభిమానులు ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో నాలుగు పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఈ పోరాట సన్నివేశాలను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ సిటీ, మార్షియస్, అబుదబి దేశాల్లో చిత్రీకరించారు. * చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న షారుక్ చిత్రమిదే. కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు * షూటింగ్ సమయంలో షారుక్‌ఖాన్ మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్‌శెట్టి ఓ సైకిల్ కొనిచ్చారట. మోకాలి గాయం తగ్గడానికి షారుక్ సైక్లింగ్ చేసేవారట. ఆ సైకిల్‌నే ఈ చిత్రంలోని ఓ షాట్లో వాడారు. * ఈ చిత్రం నిర్మాణ వ్యయం సుమారు వంద కోట్లు అని సమాచారం. ఏ విషయంలోనూ రాజీపడకుండా గౌరీ ఈ చిత్రాన్ని నిర్మించారట. * ‘దిల్వాలే’ విడుదల రోజే రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా నటించిన ‘బాజీరావ్ మస్తానీ’ విడుదల కానుంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విచిత్రం ఏమిటంటే 2007 నవంబరు 7న షారుక్‌ఖాన్ ‘ఓం శాంతి ఓం’, సంజయ్‌లీలా భన్సాలీ ‘సావరియా’ ఒకే రోజున విడుదలయ్యాయి. ‘సావరియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే, ‘ఓం శాంతి ఓం’ సూపర్‌హిట్‌గా నిలిచింది. మరి.. ఈసారి ఏం జరుగుతుందో?