RRR Movie Audio Rights: 'బాహుబలి' సినిమా తర్వాత టాలీవుడ్‌లో లెక్కలు మారిపోయాయి. తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద మోజు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, లైగర్ సహా పలు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే. అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కోట్లలోనే జరుగుతోంది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్, టీ సిరీస్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాయి.
Glad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s @RRRMovie 🤩🔥🌊
— T-Series (@TSeries) July 26, 2021
An @MMKeeravaani Musical
🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari#BhushanKumar #TSeries @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @PenMovies pic.twitter.com/w59F9XlmD5
ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ పాటలను లహరి, టీ సిరీస్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆడియో రైట్స్ ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలకు రూ.25 కోట్లు ముట్టినట్లు సమాచారం. సుమారు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాకు మొత్తంగా రూ. 900 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఫిల్మీదునియాలో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. కేవలం ప్రీరిలీజ్ బిజినెస్‌తోనే లాభాలందుకుంటోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కాసులు కురిపిస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment