లాక్‌డౌన్ టైమ్‌లో యూత్ వోటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అతుక్కుపోయింది. ‘అది కాలమహిమ, అంతే. మళ్లీ థియేటర్లు ఓపెన్ అయితే ఈ ఆకర్షణ పోతుంది. ఎంతైనా థియేటర్ థియేటరే’ అనుకున్నారు చాలామంది. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ యూత్‌లో వోటీటీ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ‘వోటీటీ వోటీటీయే– థియేటర్ థియేటరే’ అనే పరిస్థితి వచ్చింది.
వోటీటీ విషయానికి వస్తే...యూత్ ఇష్టపడే వాటిలో మోస్ట్ పాపులర్ జానర్ కామెడీ(సీ). ఆ తరువాత స్థానంలో థ్రిల్లర్(టీ), యాక్షన్(ఏ) ఉన్నాయి. దేశవ్యాప్తంగా యూత్ వోటీటీ సబ్‌స్క్రిప్షన్ విస్తృతంగా పెరిగింది. జెన్ జెడ్, మిలీనియల్స్ రెండు నుంచి మూడు వరకు వోటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిష్షన్ ఉండడం సహజమై పోయింది. మోస్ట్ పాపులర్ సోర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు వోటీటీ కేరాఫ్ అడ్రస్ కావడం వల్ల కూడా డెబ్బై శాతం పైగా యూత్ ఈ వేదికలను ఇష్టపడుతుంది.
మరోవైపు చూస్తే...
వోటీటీ ప్లామ్‌ఫామ్‌లకు యూత్ ఆడియెన్స్ టార్గెట్ అయ్యారు.
‘మీరు చెప్పిన సబ్జెక్ట్ తరువాత ఆలోచిద్దాం గానీ, ముందు ఏదైనా యూత్ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి’ అనే మాటను విన్నాడు, వింటూనే ఉన్నాడు అభిషేక్ యూదవ్.
వోటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై యూత్ పల్స్ తెలిసిన రచయితగా గుర్తింపు పొందాడు అభిషేక్.
‘యూత్ సబ్జెక్ట్ కావాలి’ అనగానే ‘ఛలో రాసేద్దాం’ అంటూ రచయితలు ఒంటిస్తంభం మేడలో కూర్చోవడానికి లేదు. వారికి కచ్చితంగా యూత్‌పల్స్ ఏమిటో తెలియాలి. అది తెలియాలంటే ఏకాంతవాసానికి స్వప్తి చెప్పాలి.
యూత్ జాడలు వెదుక్కుంటూ వెళ్లాలి.
కాలేజీ క్యాంటీన్‌లలో కూర్చొని వారి మాటలు గమనించాలి. ఊతపదాలు క్యాచ్ చేయాలి.
కాలేజీ అయిపోగానే రయ్యిమని పరుగెత్తి బస్సులో గందరగోళానికి, సరదా సందడి యాడ్ చేసే స్టూడెంట్స్‌ను గమనించాలి... ఇలాంటి హోమ్‌వర్క్ చేసిన రచయితల్లో అభిషేక్ యాదవ్ కూడా ఒకరు.
(చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!)
‘తెర మీద యూత్ తమను తాము చూసుకోవాలి. నిత్యజీవితంలో తమ అల్లర్లు, ఆలోచనలు తెర మీద చూస్తూ మమేకం కావాలి’ అంటాడు అభిషేక్.
భారతీయ జనాభాలో 46.9 శాతం పాతికేళ్లలోపు వారు ఉన్నారు.
కంటెంట్ విషయంలో వారి ‘టేస్ట్’ ఏమిటి అనేది విశ్లేషిస్తే...హాస్యమే కాని అది పూర్వపు హాస్యం కాదు. తక్కువ మాటలతో ఎక్కువగా నవ్వించే హాస్యం కావాలి. ‘అతి’ కంటె మితమైన హాస్యంతోనే నవ్వించాలి.
ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘క్యూ ఇండియా’ 24/7 కామెడీ ప్రోగ్రామ్స్‌తో ‘క్యూ కామెడీస్థాన్’ అనే డిజిటల్ చానల్ తీసుకువస్తోంది. దీనికోసం పాపులర్ డిజిటల్ కామెడీ స్టార్స్ రంగంలోకి దిగారు. పంకజ్ శర్మలాంటి కంటెంట్ క్రియేటర్లు యూత్‌పల్స్ పట్టుకునే పనిలో కసరత్తులు చేస్తున్నారు.
మరోవైపు థ్రిల్లర్, యాక్షన్ సబ్జెక్ట్‌లను కూడా ఇష్టపడుతుంది యూత్. ఉదా: స్కాటిష్ మిస్టరీ థ్రిల్లర్ ‘గిల్టీ’ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘బ్లడీ బ్రదర్స్’ (జీ5), 1957 నవల ‘డీప్ వాటర్’ను అదే పేరుతో తీసిన సైకాలజీ థ్రిల్లర్(అమెజాన్ ప్రైమ్)....మొదలైన వాటికి యూత్ నుంచి మంచి ఆదరణ లభించింది.
టీ–సీరిస్ వోటీటీ స్పేస్‌పై గట్టిగా దృష్టి పెట్టింది. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ జానర్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
‘‘యూత్‌ను ఆకట్టుకునే ఫ్రెష్, ఒరిజినల్ అండ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ మా ప్రథమ ప్రాధాన్యత’ అంటున్నారు టీ–సీరిస్ ఛైర్మన్ భూషణ్ కుమార్.
(చదవండి: నోరూరించే చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారీ ఇలా!)
యూతమ్మా! యూత్! అట్లుంటది మరి.. ‘అతి’ వద్దు.. తక్కువ మాటలతో..
Published Wed, Mar 30 2022 7:07 PM | Last Updated on Wed, Mar 30 2022 8:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment