Comedy Movies
-
యూతమ్మా! యూత్! అట్లుంటది మరి.. ‘అతి’ వద్దు.. తక్కువ మాటలతో..
లాక్డౌన్ టైమ్‌లో యూత్ వోటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అతుక్కుపోయింది. ‘అది కాలమహిమ, అంతే. మళ్లీ థియేటర్లు ఓపెన్ అయితే ఈ ఆకర్షణ పోతుంది. ఎంతైనా థియేటర్ థియేటరే’ అనుకున్నారు చాలామంది. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ యూత్‌లో వోటీటీ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ‘వోటీటీ వోటీటీయే– థియేటర్ థియేటరే’ అనే పరిస్థితి వచ్చింది. వోటీటీ విషయానికి వస్తే...యూత్ ఇష్టపడే వాటిలో మోస్ట్ పాపులర్ జానర్ కామెడీ(సీ). ఆ తరువాత స్థానంలో థ్రిల్లర్(టీ), యాక్షన్(ఏ) ఉన్నాయి. దేశవ్యాప్తంగా యూత్ వోటీటీ సబ్స్క్రిప్షన్ విస్తృతంగా పెరిగింది. జెన్ జెడ్, మిలీనియల్స్ రెండు నుంచి మూడు వరకు వోటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిష్షన్ ఉండడం సహజమై పోయింది. మోస్ట్ పాపులర్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కు వోటీటీ కేరాఫ్ అడ్రస్ కావడం వల్ల కూడా డెబ్బై శాతం పైగా యూత్ ఈ వేదికలను ఇష్టపడుతుంది. మరోవైపు చూస్తే... వోటీటీ ప్లామ్ఫామ్లకు యూత్ ఆడియెన్స్ టార్గెట్ అయ్యారు. ‘మీరు చెప్పిన సబ్జెక్ట్ తరువాత ఆలోచిద్దాం గానీ, ముందు ఏదైనా యూత్ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి’ అనే మాటను విన్నాడు, వింటూనే ఉన్నాడు అభిషేక్ యూదవ్. వోటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై యూత్ పల్స్ తెలిసిన రచయితగా గుర్తింపు పొందాడు అభిషేక్. ‘యూత్ సబ్జెక్ట్ కావాలి’ అనగానే ‘ఛలో రాసేద్దాం’ అంటూ రచయితలు ఒంటిస్తంభం మేడలో కూర్చోవడానికి లేదు. వారికి కచ్చితంగా యూత్పల్స్ ఏమిటో తెలియాలి. అది తెలియాలంటే ఏకాంతవాసానికి స్వప్తి చెప్పాలి. యూత్ జాడలు వెదుక్కుంటూ వెళ్లాలి. కాలేజీ క్యాంటీన్లలో కూర్చొని వారి మాటలు గమనించాలి. ఊతపదాలు క్యాచ్ చేయాలి. కాలేజీ అయిపోగానే రయ్యిమని పరుగెత్తి బస్సులో గందరగోళానికి, సరదా సందడి యాడ్ చేసే స్టూడెంట్స్‌ను గమనించాలి... ఇలాంటి హోమ్‌వర్క్ చేసిన రచయితల్లో అభిషేక్ యాదవ్ కూడా ఒకరు. (చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!) ‘తెర మీద యూత్ తమను తాము చూసుకోవాలి. నిత్యజీవితంలో తమ అల్లర్లు, ఆలోచనలు తెర మీద చూస్తూ మమేకం కావాలి’ అంటాడు అభిషేక్. భారతీయ జనాభాలో 46.9 శాతం పాతికేళ్లలోపు వారు ఉన్నారు. కంటెంట్ విషయంలో వారి ‘టేస్ట్’ ఏమిటి అనేది విశ్లేషిస్తే...హాస్యమే కాని అది పూర్వపు హాస్యం కాదు. తక్కువ మాటలతో ఎక్కువగా నవ్వించే హాస్యం కావాలి. ‘అతి’ కంటె మితమైన హాస్యంతోనే నవ్వించాలి. ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘క్యూ ఇండియా’ 24/7 కామెడీ ప్రోగ్రామ్స్‌తో ‘క్యూ కామెడీస్థాన్’ అనే డిజిటల్ చానల్ తీసుకువస్తోంది. దీనికోసం పాపులర్ డిజిటల్ కామెడీ స్టార్స్ రంగంలోకి దిగారు. పంకజ్ శర్మలాంటి కంటెంట్ క్రియేటర్లు యూత్పల్స్ పట్టుకునే పనిలో కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు థ్రిల్లర్, యాక్షన్ సబ్జెక్ట్‌లను కూడా ఇష్టపడుతుంది యూత్. ఉదా: స్కాటిష్ మిస్టరీ థ్రిల్లర్ ‘గిల్టీ’ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘బ్లడీ బ్రదర్స్’ (జీ5), 1957 నవల ‘డీప్ వాటర్’ను అదే పేరుతో తీసిన సైకాలజీ థ్రిల్లర్(అమెజాన్ ప్రైమ్)....మొదలైన వాటికి యూత్ నుంచి మంచి ఆదరణ లభించింది. టీ–సీరిస్ వోటీటీ స్పేస్‌పై గట్టిగా దృష్టి పెట్టింది. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ జానర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ‘‘యూత్‌ను ఆకట్టుకునే ఫ్రెష్, ఒరిజినల్ అండ్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ మా ప్రథమ ప్రాధాన్యత’ అంటున్నారు టీ–సీరిస్ ఛైర్మన్ భూషణ్ కుమార్. (చదవండి: నోరూరించే చికెన్ బ్రెడ్ పాకెట్స్ తయారీ ఇలా!) -
స్ట్రెస్ వద్దు... సినిమా చూడండి
కరోనా వార్తలు బెంబేలెత్తించవచ్చు. జనతా కర్ఫ్యూ మనం ఇంట్లోనే ఉండవలసిన బాధ్యతను గుర్తు చేయవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంచెం బ్రేక్ దొరికినట్టవుతుంది. ఇలాంటి టైములో స్ట్రెస్‌ను పక్కన పెట్టండి. హాయిగా కుటుంబంతో కామెడీ సినిమాలు చూడండి. కామెడీ సీన్లు ప్లే చేసి హాయిగా నవ్వుకోండి. ‘కరోనా’కు రోగ నిరోధక శక్తిని చూస్తే భయం. హాస్యం అత్యంత పెద్ద రోగనిరోధక శక్తి. గొప్ప హెల్త్ టానిక్. ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదోయ్’ అంటాడు శకుని ‘మాయాబజార్’లో శర్మ, శాస్త్రిలను ఉద్దేశించి. వారు చేసిన బుద్ధిమాలిన పని ఏమిటి? యాదవుల విడిదికి వచ్చి, మగపెళ్లివారమన్న సంగతిని మరచి, సాక్షాత్తు సుయోధనుని ముందే ఆడపెళ్లివాళ్లను పొగడటం... వాళ్ల ఏర్పాట్లను చూసి నోరు వెళ్లబెట్టడం. పండితులంటే గొప్పవారని మన ఉద్దేశం. కాని పాండిత్యం వేరు, బుద్ధి వేరు అని ఈ సినిమాలో నవ్వు వచ్చేలా నీతి చెబుతాడు దర్శకుడు కె.వి.రెడ్డి. కొంచెం స్ట్రెస్ వదిలించుకోవడానికి ఆ సినిమాయో సీనో చూసేయండి. బాగుంటుంది. ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ సింపుల్ జస్టిస్’ అంటుంటాడు రమణారెడ్డి ‘మిస్సమ్మ’ సినిమాలో. సావిత్రి మీద కన్నేసిన ఈ మాయలమరాఠి ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇచ్చిన అప్పును అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. అతడో పెద్ద ఫోర్ట్వంటి. కానీ నోరు తెరిస్తే ‘జస్టిస్’ అని న్యాయం మాట్లాడుతుంటాడు. లోకంలో నిండా ఉన్నది ఇలాంటి మనుషులే అని రచయిత చక్రపాణి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నవ్విస్తూ చూపుతారు ‘మిస్సమ్మ’లో. చూడండి బాగుంటుంది. ‘బ్రేకులా... మనం ఈ కారు కొన్నప్పటి నుంచి వాటి కోసమే వెతుకుతున్నాం... దొరకలేదు’ అంటాడు అక్కినేని సరాసరి తన డొక్కు కారుతో కాంచన, రాజశ్రీల కారును డాష్ కొట్టి. ‘ప్రేమించి చూడు’లో రెండు జంటలు, నాలుగు నవ్వులు ఉంటాయి. ‘నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద... సాయము వలదా’ వంటి రసగుల్లాలు, ‘అందాలు తొంగి చూసే హా..హా..హా..’ వంటి పాల తాలికలు ఉంటాయి. ఈ సినిమాలోనే సినిమా పిచ్చోడు చలం వాళ్ల నాన్న రేలంగికి వల్లకాడు కథ చెప్పి భయపెడుతుంటాడు. రావికొండల రావు ‘తెలుగు మాష్టారు’ హాస్యం ఉంటుంది. సరదా సినిమా. ఇది ఖాళీ సమయం. చూసేయండి. భానుమతిని చాలా సినిమాల్లో ఇష్టంగా చూడొచ్చుగాని ‘మట్టిలో మాణిక్యం’లో ఇంకా ఇష్టంగా చూడొచ్చు. ఆమె వ్యంగ్యం అంతా ఆ సినిమాలో ఉంటుంది. మరిది చలంను కన్నబిడ్డలాగా కాపాడుకోవడంలో ఆమె చూపించే ఆరిందాతనం ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ఎంతో అమాయకంగా ఉండే చలం నటన, అతని స్నేహితుడిగా పద్మనాభం హాస్యం సినిమాను పరుగులెత్తిస్తాయి. జమున ఒక జాంపండులా ఉంటుంది. ‘నా మాటే నీ మాటై చదవాలి’ అని పాట కూడా పాడుతుంది. ఇంట్లోనే ఉండి హైదరాబాద్ చుట్టేయాలంటే ఈ సినిమా చూడొచ్చు. ‘రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ పాడేయొచ్చు. రేడియో ప్రోగ్రామ్ వింటూ వంకాయ కూర చేద్దామనుకుంటాడు సీతాపతి. కానీ పక్క స్టేషన్లో యోగా క్లాస్ కూడా వస్తుంటుంది. రెండు స్టేషన్లూ జామ్ అవుతుంటాయి. దాంతో యోగా చేస్తూ వంకాయ కూర చేస్తూ నవ్విస్తాడు మనల్ని. ‘సీతాపతి సంసారం’ సినిమా మధ్యతరగతి గుమాస్తా బతుకులో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ఉన్న కంప్లయింట్లను లైటర్ వెయిన్‌లో చూపిస్తుంది. సంసారం పెద్ద కష్టం కాదు అని భార్య రోల్‌లోకి వచ్చిన సీతాపతి చాలా కామెడీ చేస్తాడు. చంద్రమోహన్, ప్రభ నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త తీరుబడిగా ఉండే సమయం. చాలా కంప్లయింట్లు చేసుకునే మూడ్ కూడా వస్తుంది. ఆ మూడ్ వద్దు. అడ్జ్‌స్ట్ అవుతూ బతకడమే ముద్దు అని ‘సీతాపతి సంసారం’ చూసేయండి. అతనికి ఆరుగురు పిల్లలు. ఆమెకు అరడజను సంతానం. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. అతని పిల్లలు రౌడీ మూక. ఆమె పిల్లలు కిష్కింధ ఇలాక. ఈ పన్నెండు మంది కలిస్తే ఆ పెళ్లి ఎంత అల్లరిగిల్లరిగా, ఆ కాపురం ఎంత నవ్వులుపువ్వులుగా ఉంటుందో చెప్ప లేం. ‘రామదండు’ సినిమా ఇది. మురళీమోహన్, సరిత నటించారు. కె.బాలచందర్ దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ‘బండి కాదు మొండి ఇది సాయం పట్టండి’ పాట ఇందులోదే. ఇంట్లో పిల్లలు ఇప్పుడేం చేయాలో తెలియక కోతి పనులు చేస్తుంటారు. వారికి ఈ కోతి సినిమా చూపించండి. బుద్ధిగుంటారు. భలే నవ్వుకుంటారు. ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ, పి.ఎన్.రామచంద్రరావు, శివ నాగేశ్వరరావు, భీమనేని శ్రీనివాసరావు, విజయ భాస్కర్... వీరంతా తీసిన సినిమాలు తెలుగులో ఎన్నో స్ట్రెస్ బస్టర్స్‌గా ఉన్నాయి. ఎన్నో పాత్రలు నవ్వించి మనల్ని కాసేపు టెన్షన్స్ మర్చిపోయేలా చేస్తాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో కోపం వస్తే తల గోడలకేసి బాది క్రాకులు సృష్టించే సుత్తి వీరభద్రరావు, ‘ఆనందభైరవి’లో నవ్వొచ్చినా ఏడుపొచ్చినా కయ్యిన విజిల్ వేసే శ్రీలక్ష్మి, ‘ఎదురింటి మొగుడు–పక్కింటి పెళ్లాం’లో స్టాంపు అంటించడానికి కూడా సొంత ఉమ్మును వాడటానికి వెనుకాడే పిసినారి రాజేంద్రప్రసాద్, వాళ్లకూ వీళ్లకూ ఠస్సా ఇచ్చి వీడియోలైబ్రరీ పెట్టే ‘ఏప్రిల్ 1 విడుదల’ దివాకరం, ‘ఆ ఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడు రావు గోపాలరావు, అద్దె ఇంటి కోసం ఆడవేషం కట్టే ‘చిత్రం భళారే విచిత్రం’ నరేష్, ‘మనీ’లో ఖాన్‌దాదా, ‘శుభాకాంక్షలు’లో ‘చరణకింకిణులు గొల్లుగొల్లుమన’ పాడే గాయకుడు ఏ.వి.ఎస్, ‘నువ్వు నాకు నచ్చావ్’లో తల్లి మీద కవిత్వం చెప్పే ఎమోషనల్ కొడుకు ప్రకాష్ రాజ్... వీరంతా ఈ కరోనా కాలంలో కాసింత దృష్టి మళ్లించే ఔషధాలు... మందులు. కనుక స్ట్రెస్ మానండి. సినిమా చూడండి. – సాక్షి ఫ్యామిలీ -
కామెడీ సినిమాలు చేయాలనుంది
‘‘ఆల్రెడీ మన జీవితంలో కావాల్సినంత డ్రామా ఉంది. అందుకే డ్రామా సినిమాల్లో నటించాలనే ఆసక్తి తగ్గిపోయింది. ప్రస్తుతానికి అయితే∙కామెడీ చేయాలనుంది’’ అంటున్నారు శిల్పా శెట్టి. సిల్వర్ స్క్రీన్‌పై ఈ భామ కనిపించి ఆల్మోస్ట్ తొమ్మిదేళ్లు అయిపోతోంది. మళ్లీ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తే ఎలాంటి స్క్రిప్ట్‌ని ఎంచుకుంటారని శిల్పాను అడిగితే ఈ విధంగా అన్నారు. ‘‘యాక్టర్‌గా నా లాస్ట్ సినిమా ‘అప్నే’. ఈ తొమ్మిదేళ్లలో స్క్రిప్ట్స్ ఎంచుకునే విషయంలో చాలా ప్రాక్టికల్ అయిపోయాను అనుకుంటున్నాను. నా దగ్గరకు స్క్రిప్ట్స్ వస్తూనే ఉంటాయి. సగం చదివేసరికి ‘ఇలాంటిది మనం ఆల్రెడీ చేసేశాం కదా’ అనే ఆలోచన వచ్చేస్తోంది. ప్రస్తుతం నా స్పేస్‌ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ మళ్లీ యాక్ట్ చేయాలంటే మా అబ్బాయిని విడిచి సినిమా చేసే అంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయినా అయ్యుండాలి లేదా నేను ఇదివరకెప్పుడూ ట్రై చేయని రోల్ అయినా అయ్యుండాలి. ముఖ్యంగా కామెడీ సినిమాలైతే ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తాయి. అలాంటివి చేయాలనుకుంటున్నా. అవైతే మా అబ్బాయికి కూడా చూపించొచ్చు కదా’’ అని పేర్కొన్నారు శిల్పా. -
'యాక్షన్ కాదు.. కామెడీ చేయాలని ఉంది'
ముంబయి: హృతిక్ రోషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది డ్యాన్స్‌లు.. అదిరిపోయే స్టెప్పులు.. ఆ తర్వాత యాక్షన్, రోమాన్స్. కానీ, ఆయనలో ఇప్పటి వరక కామెడీ యాంగిల్ చూడనే లేదు. అయితే త్వరలోనే తన అభిమానులకు ఆ కోరిక తీరబోతుండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు యాక్షన్, రోమాన్స్ చిత్రాలతో మాత్రమే తన అభిమానులను కనువిందుచేసి భారీ హిట్లు కొట్టిన ఈ ప్రముఖ బాలీవుడ్ హీరో కుదిరితే కామెడీ చిత్రం చేస్తానంటున్నాడు. ఇటీవల విడుదలైన హౌజ్ ఫుల్ 3 చిత్ర ట్రైలర్ చూసి ఉబ్బి తబ్బిబ్బు అయిన ఆయన తనకు ఈ చిత్ర ట్రైలర్ ఎంతో నచ్చిందని, ట్రైలర్ అదుర్స్ అని పొగిడాడు. అందులోని కామెడీ అదిరిపోయిందని, ట్రైలర్ పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, ఆ సినిమా రాగానే చూస్తానని, ఎప్పుడెప్పుడు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, నర్గీస్ ఫక్రీ, అభిషేక్ బచ్చన్ల కామెడీని చూస్తానా అని ఎదురుచూస్తున్నాని చెప్పాడు. వారు చేసే కామెడీ నుంచి స్ఫూర్తిపొంది తన అభిమానులకోసం ఓ కామెడీ సినిమా చేయాలని భావిస్తున్నాని చెప్పాడు. జూన్ 3న హౌజ్ ఫుల్ 3 చిత్రం విడుదలకానుంది. -
మళ్లీ రేలంగి మార్క్ సినిమా
కామెడీ సినిమాలు తీయడంలో రేలంగి నరసింహారావుది ఓ ప్రత్యేకమైన శైలి. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు తెరపై తిరుగులేని విజయాల్ని దక్కించుకున్నారాయన. కొంత విరామం తరువాత ఆయన మళ్లీ మెగాఫోన్ చేతపట్టనున్నారు. హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ హీరోగా ఓ చిత్రం రూపొందించనున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటను రికార్డ్ చేశారు. నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెళ్ల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలుమాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఇందులో బ్రహ్మానందం, ఓ ఎలుక ప్రధాన పాత్రధారులు’’ అని తెలిపారు. మోనికా సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో రఘబాబు, తిరుపతి ప్రకాశ్ ముఖ్య తారాగణం. -
ప్రేక్షకులు హాస్యాన్ని కోరుకుంటున్నారు
నరసన్నపేట: ప్రస్తుతం ప్రేక్షకులు హాస్యాని కోరుకుంటున్నారని ప్రముఖ సినీనటుడు, నరసన్నపేట వాస్తవ్యుడు ప్రభాస్ శ్రీను చెప్పారు. తనకు కామెడీ, నెగిటివ్ పాత్రలే చిత్ర పరిశ్రమలో గుర్తింపుని తెచ్చిపెట్టాయని చెప్పారు. ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా నరసన్నపేట కొత్తవీధిలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆయన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 సినిమాల్లో నటించినట్టు చెప్పారు. తాను నటించిన మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. చరిత్ర సృష్టించనున్న బహుబలి సినిమాలో కూడా నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తండ్రి యర్రయ్య , తల్లి సరోజల సహకారం వల్ల చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోగలిగానన్నారు. -
కామెడి సూత్ర Part 1