మళ్లీ రేలంగి మార్క్ సినిమా | Again Relangi Mark movie | Sakshi
Sakshi News home page

మళ్లీ రేలంగి మార్క్ సినిమా

Published Fri, Jan 30 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

మళ్లీ  రేలంగి మార్క్  సినిమా

మళ్లీ రేలంగి మార్క్ సినిమా

కామెడీ సినిమాలు తీయడంలో రేలంగి నరసింహారావుది ఓ ప్రత్యేకమైన శైలి. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు తెరపై తిరుగులేని విజయాల్ని దక్కించుకున్నారాయన. కొంత విరామం తరువాత ఆయన మళ్లీ మెగాఫోన్ చేతపట్టనున్నారు. హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ హీరోగా ఓ చిత్రం రూపొందించనున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటను రికార్డ్ చేశారు. నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెళ్ల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలుమాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఇందులో  బ్రహ్మానందం, ఓ ఎలుక ప్రధాన పాత్రధారులు’’ అని తెలిపారు. మోనికా సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో రఘబాబు, తిరుపతి ప్రకాశ్ ముఖ్య తారాగణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement