
శిల్పా శెట్టి
‘‘ఆల్రెడీ మన జీవితంలో కావాల్సినంత డ్రామా ఉంది. అందుకే డ్రామా సినిమాల్లో నటించాలనే ఆసక్తి తగ్గిపోయింది. ప్రస్తుతానికి అయితే∙కామెడీ చేయాలనుంది’’ అంటున్నారు శిల్పా శెట్టి. సిల్వర్ స్క్రీన్‌పై ఈ భామ కనిపించి ఆల్మోస్ట్ తొమ్మిదేళ్లు అయిపోతోంది. మళ్లీ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తే ఎలాంటి స్క్రిప్ట్‌ని ఎంచుకుంటారని శిల్పాను అడిగితే ఈ విధంగా అన్నారు. ‘‘యాక్టర్‌గా నా లాస్ట్ సినిమా ‘అప్నే’. ఈ తొమ్మిదేళ్లలో స్క్రిప్ట్స్ ఎంచుకునే విషయంలో చాలా ప్రాక్టికల్ అయిపోయాను అనుకుంటున్నాను. నా దగ్గరకు స్క్రిప్ట్స్ వస్తూనే ఉంటాయి.
సగం చదివేసరికి ‘ఇలాంటిది మనం ఆల్రెడీ చేసేశాం కదా’ అనే ఆలోచన వచ్చేస్తోంది. ప్రస్తుతం నా స్పేస్‌ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఒకవేళ మళ్లీ యాక్ట్ చేయాలంటే మా అబ్బాయిని విడిచి సినిమా చేసే అంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయినా అయ్యుండాలి లేదా నేను ఇదివరకెప్పుడూ ట్రై చేయని రోల్ అయినా అయ్యుండాలి. ముఖ్యంగా కామెడీ సినిమాలైతే ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తాయి. అలాంటివి చేయాలనుకుంటున్నా. అవైతే మా అబ్బాయికి కూడా చూపించొచ్చు కదా’’ అని పేర్కొన్నారు శిల్పా.
Comments
Please login to add a commentAdd a comment