
సిడ్నీ : భారత అభిమానులపై మాజీ రేసర్, అడల్ట్ స్టార్ రెనీ గ్రేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనుమతి లేకుండా భారత అభిమానులు తన ఫొటోలను, వీడియోలను వినియోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ పేజీలు సృష్టించి.. అక్రమంగా తన కంటెంట్‌ను అందులో పోస్ట్ చేయవద్దని కోరారు. అది కేవలం తనకు మాత్రమే చెందిన కంటెంట్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు అడల్ట్ సబ్‌స్క్రిషన్ సైట్‌లో ఓ పోస్ట్ చేశారు.
‘కాపీ రైట్ నిబంధనలు ఉల్లంఘించకండి.. నా పేజీలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల హక్కులను నేను మాత్రమే కలిగి ఉన్నాను. మీరు కాదు. నా పేరిట ఫేక్ పేజీలు నడపటం మానుకోండి. చట్ట విరుద్ధంగా నా వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం ఆపండి. ప్రస్తుతం నేను భారతీయులను ఇష్టపడటం లేదు. ఒకవేళ మీరు ఇండియన్ అయితే నా పేజీ నుంచి వెంటనే వైదొలగండి. ఇకపై వారిని నా పేజీలో అనుమతించను. నేనే నా పేజీ నుంచి భారతీయులను అందరినీ తొలగించబోతున్నాను’ అని గ్రేసీ పేర్కొన్నారు. అలాగే తన ఫొటోలు షేర్ చేసేవారిపై ఆమె అసభ్య పదజాలన్ని కూడా వాడారు.
కాగా, వీ8 సూపర్ కార్స్‌లో మొదటి ఫుల్ టైం లేడీ రేసర్ రెనీ గ్రేసీ కావడం గమనార్హం. రేసర్‌గా మంచి గుర్తింపు పొందిన గ్రేసీ.. ఆ తర్వాత అడల్ట్ స్టార్‌గా మారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. చాలా కాలంగా రేసర్‌గా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే అడల్ట్ స్టార్‌గా మారినట్టు చెప్పారు. (బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌గా..)
Comments
Please login to add a commentAdd a comment