ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్! | Poonam Pandey Facebook account deactivated | Sakshi
Sakshi News home page

ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్!

Published Thu, Aug 28 2014 11:44 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్! - Sakshi

ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్!

దైనందిక జీవితంలో సోషల్ మీడియా వినియోగం చెప్పలేనంతగా పెరిగిపోయిందనడంలో సందేహం అక్కర్లేదు. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సోషల్ మీడియా ఆధారంగా అభిమానులకు, కార్యకర్తలకు తమ సందేశాన్ని చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో బాలీవుడ్ తార పూనమ్ పాండే కూడా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. 
 
కాని పూనమ్ పాండేకు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ షాకిచ్చింది. పూనమ్ పాండే అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2.1 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించడం వెనుక కారణాలను ఫేస్ బుక్ సంస్థ తెలుపలేదు. తన ఫేస్ బుక్ అకౌంట్ ను తొలగించారంటూ పూనమ్ పాంటే ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 
 
నిజంగా బాధగా ఉంది. నా అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ను ఫేస్ బుక్ తొలగించింది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఏం చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తోందో చెప్పండి అంటూ ట్విటర్ లో పూనమ్ ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
ఎవరైనా సరే అసభ్యకరమైన, అశ్లీలకరంగా ఉండే అంశాలను పోస్ట్ చేస్తే ఫేస్ బుక్ అకౌంట్లను సాధారణంగా నిలిపివేస్తోంది. పూనమ్ పాండే అకౌంట్ నిలిపివేయడం వెనుక కారణాల తెలియాల్సి ఉంది. కావున ఎవరైనా సోషల్ మీడియాను హద్దు మీరి ప్రవర్తిస్తే ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది.. జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement