సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది జులైలో అట్టహాసంగా తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌సీడీ స్ర్కీన్లను ఆవిష్కరించిన రైల్వేలు ఏడాది తిరగకుండానే వాటిని శాశ్వతంగా తొలగించనున్నాయి. ప్రయాణీకులు ఎల్‌సీడీ స్క్రీన్లను పలుమార్లు ధ్వంసం చేయడం, హెడ్‌ఫోన్స్‌ను పగులగొట్టడం వంటి ఘటనలతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోతుండటంతో రైల్వేలు వాటిని తొలగించాలని నిర్ణయించాయి.
కొందరు ప్రయాణీకులు ఎల్‌సీడీ స్ర్కీన్లను తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వాటిని పూర్తిగా పెకిలించే ప్రయత్నం చేస్తుండటంతో విస్తుపోవడం అధికారుల వంతవుతోంది. ముంబయి నుంచి గోవాకు వెళ్లే తేజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌సీడీ స్క్రీన్లను జెండా ఊపి ప్రారంభించినప్పటి నుంచే వాటిని ధ్వంసం చేయడం, చెడగొట్టడం మొదలైందని అధికారులు చెబుతున్నారు. నిర్వహణ ఖర్చుల భారంతో తేజాస్, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ల్లో ప్రతిసీటు వెనుకాల అమర్చిన అన్ని ఎల్‌సీడీ స్క్రీన్లనూ తొలగించాలని రైల్వేలు నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment