స్మార్ట్ఫోన్లలో ఇక ఓలెడ్ స్క్రీన్లు!
స్మార్ట్ ఫోన్లో ఎల్సీడీ డిస్ప్లేల స్థానాన్ని ఓలెడ్ డిస్ప్లేలు స్వాధీనం చేసుకోబోతున్నాయట. 2020వరకు ఓలెడ్ డిస్ప్లేలు స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే టెక్నాలజీని ఏలుతాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రారాజుగా ఉన్న శాంసంగ్ ఇప్పటికే ఈ ఓలెడ్ డిస్ప్లేలతో తన ఫ్లాగ్ షిప్‌లను రిలీజ్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఈ డిస్ప్లేతోనే మార్కెట్లోకి వచ్చింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు హ్యువాయ్, ఓపో ఎలక్ట్రానిక్స్, వివో, మిజు టెక్నాలజీ వంటి ఇతర సంస్థల నుంచి ఈ డిస్ప్లే టెక్నాలజీకి బాగా డిమాండ్ పెరుగుతుందని ఇన్వెస్టర్స్.కామ్ బిజినెస్ వెబ్సైట్ పేర్కొంది. రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారు యాపిల్ సైతం ఐఫోన్8 నుంచి ఓలెడ్ డిస్‌ప్లేలోకి మారబోతుందని వెల్లడించింది.
ఈ డిస్ప్లేలకు పెరుగుతున్న డిమాండ్‌తో, ఓలెడ్ ప్రొడక్ట్‌లకు మెటీరియల్స్, టెక్నాలజీ సరఫరాచేసే యూనివర్సల్ డిస్ప్లే కార్పొరేషన్ భారీగా లాభపడనుందని ఈ వెబ్సైట్ పేర్కొంటోంది. గత 12నెలలో ఈ స్టాక్‌కు భారీగా డిమాండ్ పెరిగి, 40శాతం ఎగిసిందని రిపోర్టు నివేదించింది. కాగా 15 ఏళ్లకు పైగా స్మార్ట్ ఫోన్ డివైజ్ డిస్ప్లేలలో ఎల్సీడీ స్క్రీన్లు ఎక్కువ ఆధిపత్యంలో ఉండేవి. కానీ ఓలెడ్ డిస్ప్లేలు చాలా సౌకర్యవంతంగా, థిన్నర్‌గా ఉంటూ మార్కెట్లోకి రావడంతో, ఎల్సీడీ స్థానాన్ని ఈ ఓలెడ్లు స్వాధీనం చేసుకోబోతున్నాయట. ఎల్సీడీ డిస్ప్లేల కంటే మరింత సమర్థవంతంగా ఈ డిస్ప్లేలు ఉంటున్నాయట.దీంతో వీటికి మొబైల్ కంపెనీల నుంచి బాగా క్రేజ్ పెరుగుతోంది.