కరీంనగర్(వీణవంక): వీణవంక మండలంలో డీఆర్‌డీఏ అధికారులు శుక్రవారం సామాజిక తనిఖీలు నిర ్వహించారు. ఆసరా పింఛన్‌లు తీసుకున్న వారిలో 170 మంది అనర్హులుగా తేలడంతో వారికి ఆసరా పింఛన్‌లు తొలగించారు. వారి నుంచి రూ.4.3 లక్షలను రికవరీ చేయాలని అధికారులను డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ ఆదేశించారు. అనర్హులకు పింఛన్‌లు ఇచ్చినందుకు గానూ చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సారయ్యకు వెయ్యి రూపాయలు జరిమాన విధించారు.