
బీజింగ్ : టెక్ దిగ్గజం యాపిల్ తన చైనీస్ యాప్ స్టోర్స్ నుంచి శనివారం 29,800 యాప్స్‌ను తొలగించింది. వీటిలో 26,000కు పైగా గేమ్ యాప్స్ ఉన్నాయని పరిశోధన సంస్‌థ క్విమై వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నెంబర్‌ను ఈ ఏడాది జూన్‌లోగా సమర్పించాలని అంతకుముందు గేమ్ పబ్లిషర్లకు యాపిల్ డెడ్‌లైన్ విధించింది. చైనా యాండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ఎప్పటినుంచో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి వాటిని కఠినంగా అమలు చేయాలని యాపిల్ ఎందుకు నిర్ణయించిందో స్పష్టం కాలేదు.
జులై మొదటివారంలో తన యాప్ స్టోర్ నుంచి యాపిల్ 2500కు పైగా టైటిల్స్‌ను తొలగించింది. యాప్స్ తొలగింపుతో జింగా, సూపర్‌సెల్ వంటి యాప్‌లు ప్రభావితమయ్యాయని పరిశోధన సంస్థ సెన్సార్ టవర్ అప్పట్లో పేర్కొంది. సెన్సిటివ్ కంటెంట్‌ను నియంత్రించేందుకు గేమింగ్ పరిశ్రమకు చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు ఉండాలని దీర్ఘకాలంగా కోరుతోంది. గేమింగ్ యాప్స్‌పై కఠిన నిబంధనలు విధించడం చిన్న మధ్యతరహా డెవలపర్ల రాబడిపై ప్రభావం చూపుతుందని, బిజినెస్ లైసెన్స్ పొందడంలో ఎదురయ్యే అవరోధాలు మొత్తం చైనా ఐఓఎస్ గేమ్ పరిశ్రమకే విఘాతమని యాప్‌ఇన్ చైనా మార్కెటింగ్ మేనేజర్ టాడ్ కున్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్- భల్లేభల్లే
Comments
Please login to add a commentAdd a comment