
శాన్ ఫ్రాన్సిస్కో: చాట్ జీపీటీకి రూపకల్పన చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు ఆ సంస్థ ఉద్వాసన పలికింది. కంపెనీ బోర్డుకు విశ్వాసం కలిగేలా ఆయన వ్యవహరించడం లేదని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ ఏఐకి సారథిగా ఆయన సామర్థ్యంపై కంపెనీ బోర్డుకు విశ్వాసం పోయిందని పేర్కొంది.
ఆయన స్థానంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ అధికారిణి మిరా మురాటికి తాత్కాలిక సీఈవో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.