నగరంలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు.
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టారు.