సోనీపట్: హరియాణాలోని సోనీపట్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై కాంక్రీట్ గోడ నిర్మించినందుకు, బోరు బావి తవ్వినందుకు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ), స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు ఐపీసీతోపాటు జాతీయ రహదారుల చట్టం కింద రెండు వేర్వేరు కేసులు పెట్టినట్లు ఆదివారం తెలిపారు.
జాతీయ రహదారిపై గోడ నిర్మించడం, బోరుబావి తవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టంచేశారు. ఫిర్యాదు రాగానే ఆయా పనులను నిలిపివేయించినట్లు పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు 44వ నంబర్ జాతీయ రహదారిపై కాంక్రీట్ గోడ నిర్మించారు. బోరు బావి కూడా తవ్వారు. ఈ పనులు పూర్తికాలేదు.
చదవండి: బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు..
Comments
Please login to add a commentAdd a comment