ఉద్యోగినితో ఎఫైర్‌ : మెక్‌డొనాల్డ్‌ సీఈవోపై వేటు | McDonalds CEO Out After Consensual Relationship | Sakshi
Sakshi News home page

ఉద్యోగినితో ఎఫైర్‌ : మెక్‌డొనాల్డ్‌ సీఈవోపై వేటు

Published Mon, Nov 4 2019 8:52 AM | Last Updated on Mon, Nov 4 2019 8:55 AM

McDonalds CEO Out After Consensual Relationship - Sakshi

న్యూయార్క్‌ : కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సంస్థ ఉద్యోగినితో శారీరక సంబంధం నెరిపిన ప్రెసిడెంట్‌, సీఈవో స్టీవ్‌ ఈస్టర్‌బ్రూక్‌పై మెక్‌డొనాల్డ్స్‌ వేటు వేసింది. కంపెనీ విధానాలను ఉల్లంఘిస్తూ పరస్పర అంగీకారంతో ఉద్యోగినితో ఎఫైర్‌ సాగించిన ఈస్టర్‌బ్రూక్‌ను తొలగించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని మెక్‌డొనాల్డ్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈస్టర్‌బ్రూక్‌ స్ధానంలో క్రిస్‌ కెంప్‌స్కీని మెక్‌డొనాల్స్ట్‌ యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌గా నియమస్తూ ఆయన డైరెక్టర్‌గా కంపెనీ బోర్డులోనూ అడుగుపెడతారని తెలిపింది.

కంపెనీలో నాయకత్వ మార్పునకు సంస్థ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా కంపెనీ విధానాలకు విరుద్ధంగా ఉద్యోగినితో తన రిలేషన్‌షిప్‌ పొరపాటు చర్యేనని మెక్‌డొనాల్డ్స్‌ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఈస్టర్‌బ్రూక్‌ పేర్కొన్నారు. కంపెనీ పాటించే విలువలను గౌరవిస్తూ తాను తప్పుకోవాలన్న బోర్డు నిర్ణయాన్ని అంగీకరిస్తానని చెప్పారు. ప్రపంచంలోనే దిగ్గజ ఫాస్ట్‌ఫుడ్‌ చైన్‌గా పేరొందిన మెక్‌డొనాల్డ్స్‌కు 100కు పైగా దేశాల్లో 38,000కు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement