ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశిస్తున్న బాలకృష్ణ
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు.
అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్‌పాత్‌పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు.
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్‌పాత్‌పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు.
ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment