NTR Death Anniversary
-
నాపై సోషల్ మీడియాలో వేధింపులు.. బాబుకు బాధ్యత లేదా?: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi). మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా తాను బ్రతుకుతున్నట్టు తెలిపారు.నేడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘29 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు దూరమై మనోవేదనకు గురవుతున్నాను. నా ఫోన్ నెంబర్‌ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటారా?. ఇన్నేళ్లు డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష.. నేనేం తప్పు చేశాను. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్న సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), రామకృష్ణ (Rama Krishna)లు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి నటుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించనున్నారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి (ఫొటోలు)
-
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు.. ఎన్టీఆర్ ఘాట్‌కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్‌పాత్‌పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్‌పాత్‌పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు. ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు. -
తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు)
-
గుడివాడలో హై అలెర్ట్
-
గుడివాడలో హై అలెర్ట్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. హీటెక్కిన గుడివాడ రాజకీయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాబు మాములోడు కాదుగా! చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది. -
మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే... యమునా తీరే! జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్మోహన్రాజు విడిగా తన వర్గంతోకలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది. చిట్వేలిలో చీలిన నాయకులు.. చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్ వచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదనపల్లెలో మూడుముక్కలాట మదనపల్లె: నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్‌ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్చార్జి శంకర్‌తో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్‌లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ నిమ్మనపల్లె సర్కిల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్‌మోహన్‌రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!) -
ఆ దొంగల్ని అభిమానులు మట్టికరిపించారు: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనం గుర్తించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారని చెప్పారు. బుధవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'నేటికీ అనేకమంది ఎన్టీఆర్ పేరు, ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన తమకు ఆదర్శమంటూ నేడు కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారు. పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జీవితం ఆదర్శం. గుడివాడ నుంచి రెండుసార్లు అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం' అని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. చదవండి: (నా ఆస్తి టీడీపీకి ఎందుకు ఇవ్వాలి?: శేషారత్నం) -
ఏపీలో ఎన్టీఆర్ కలల పాలన: లక్ష్మీపార్వతి
ఖైరతాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఎంతో న్యాయం జరుగుతోందని, ఎన్టీఆర్ కలలుగన్న రాజ్యం సాకారమైందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కావాలని తొలగించడంలాంటి చర్యలు ఏ పార్టీకి మంచిది కాదని చెప్పారు. ప్రతిపక్షాల వారు వైఎస్ జగన్ లాగా హుందాగా వ్యవహరించాలని కోరారు. ఎన్టీఆర్ లెజెండ్..: బాలకృష్ణ: ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ సినీ, రాజకీయరంగాల్లో ఎన్టీఆర్ పాత్ర మరువలేనిదని, ఆయన లెజెండ్ అని చెప్పారు. -
ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో విషాదం
సాక్షి, దర్శి టౌన్: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో విద్యుదాఘాతానికి గురై టీడీపీ కార్యకర్త మృతి చెందిన ఘటన దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది. గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ వర్థంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గ్రంథాలయం ఎదురుగా జెండా దిమ్మె వద్ద ఇనుపరాడ్‌కు టీడీపీ జెండా ఎత్తుతుండగా బ్యాలెన్స్ తప్పి ఇనుప రాడ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. రాడ్ పట్టుకొని ఉన్న టీడీపీ కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ(36) విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతునికి భార్య మహాలక్షి్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆ పార్టీ నియోజక వర్గ నియోజక వర్గ సమన్వయకర్త పమిడి రమేష్‌లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన స్థలాన్ని ఎస్సై రామకోటయ్య సందర్శించి వివరాలు సేకరించారు. హెచ్‌సీ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. చదవండి: ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది -
‘వెన్నుపోటు గురించి ఎన్టీఆర్ బయోపిక్‌లో చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, అటువంటి వ్యక్తికి భారతరత్న రావడం చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గురువారం ఉదయం ఆమె ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు చివరి రోజుల్లో అన్యాయం జరిగిందని, బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లో వెన్నుపోటు గురించి చెప్పాలని అన్నారు. తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్‌ను పట్టించుకోని ఆ మహాసభలకు బాలకృష్ణ ఎందుకు వెళ్లారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని అన్నారు. అ అలాగే ఎన్టీఆర్ పేరు లేకుండా చేసేందుకే సంక్షేమ పథకాలకు చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
‘ఎన్టీఆర్‌లో బయటకి తెలియని ఎన్నో కోణాలు’
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 22వ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ గురించి ప్రజలకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. మేం తీయబోయే ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమాలో వాటిని చూపిస్తాం. ఎన్టీఆర్ పేరు పేదవారి హృదయ స్పందన. భూమి మీద ఎందరో పుడతారు..గిడతారు. కానీ అందరూ మహానుభావులు కాలేరు. మాటలు కాకుండా చేతల్లో చేసి చూపి తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేసిన మహానుభావుడు. ఎన్టీఆర్ అంటే... ఎన్టీఆర్‌లో ఎన్ అంటే ఆయన ఇల్లే నటనాలయం ఆయనే నటరాజు. టీ అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రారాజు రాజకీయ దురందరుడు. రమణీయ రమ్య సుందరుడు. ఆలోచనే కాదు... అప్పటివరకూ అమల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి. మహిళలకు ప్రత్యేక యూనివర్శిటీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. భౌతికంగా ఎన్టీఆర్ మనమధ్యలో లేకపోయినా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నటుడిగా ఆయన బిడ్డగా తర్వలోనే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తున్నాం. ఆయనలో బయటకి తెలియని ఎన్నో కోణాలున్నాయి. వాటన్నింటినీ ఈ సినిమాలో చూపిస్తాం. తెలుగు మహాసభల్లో నా ధర్మంగా నేను అన్నగారిని గుర్తు చేశా. ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేస్తున్నాం.’ అని అన్నారు. యుగపురుషుడు...మహానుభావుడు ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే యుగాలు చాలవని, తరాలు తీరవని ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ..‘తెలుగు భాష, జాతి ఉన్నంతకాలం ప్రతి ఇంటా మహానుభావుడు జీవించి ఉంటాడు. మే 28 ఆయన జయంతి. ఆరోజు ప్రతీ ఇంట పండుగ. ఇక జనవరి 18 ఆయన మరణం ఒక దు:ఖ దినం. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫామ్స్. ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా పేర్లు మార్చి పథకాలు తెస్తున్నారు. కానీ అవి అన్ని అన్నగారు ప్రారంభించినవే. బాపూజీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు ఇలా అందరి ఆశయాలు కలగలిపితే ఎన్టీఆర్. త్రిలింగదేశమైన తెలుగుజాతి ఒక రాష్ట్రంగా ఉండాలని ప్రాణ త్యాగం చేసి రాష్ట్రం సాధించింది పొట్టి శ్రీరాములు. అయితే రాష్ట్రం సాధించినా మదరాసీలుగా గుర్తించబడుతున్నామని తెలుగు వారి సత్తాను దశదిశలా చాటింటి ఎన్టీఆర్. ఆయన కడుపున పుట్టడమే మహాద్భాగ్యం. ఆయనకు భారతరత్న కోసం అందరూ కలిసి కృషి చేయాలి. తెలుగువారు ఉన్నంతకాలం ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారు. ఆయనను తెలుగు మహాసభల్లో తలచుకోలేదంటే ఇక మేమం ఏం చేయలేం.’ అని అన్నారు. కాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం హరికృష్ణ, బాలకృష్ణ,కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు... ఎన్టీ రామారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్‌లుక్ కాగా ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం ఉదయం విడుదల చేసింది. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నారు. బాలకృష్ణ, కొర్రపాటి సాయి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’కు కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. -
నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి
జనవరి 18వ తేదీని చంద్రబాబు నికృష్ట రాజకీయానికి ప్రతిరూపంగా పరిగణించాలి. ఇప్పటికీ ఎన్టీఆర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తూ బతుకుతున్న చంద్రబాబు నీచ రాజకీయానికి శాశ్వత సమాధి కట్టాలి. వెన్నుపోటు చర్య తప్పు కాదని చెప్పేందుకు చంద్రబాబునాయుడు చరిత్రను మార్చేందుకు కూడా సిద్ధపడ్డారు. స్త్రీలోలుడైన మావో నుంచి చైనాను రక్షించేందుకు డెంగ్ జియావో పింగ్ తిరుగుబాటు చేశాడని బూటకపు ప్రచారం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల శిక్షణ కోసం వెలువరించిన పుస్తకాలలో ఇలాంటి వక్రీకరణలను చొప్పించారు. ఎన్టీఆర్ కూడా స్త్రీలోలుడట! ఆయన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే చంద్రబాబు తిరుగుబాటు చేశాడట! అధికార దాహంతో 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుని చేసి, ఇందుకు ఎన్టీఆర్ భార్య కారణమని పచ్చ పత్రికల సాయంతో దుష్ప్రచారం చేయడం చూస్తే, చరిత్రలో ఇంత అథమస్థాయి నేత మరొకరు ఉండరని చెప్పవచ్చు. ఒక ప్రశ్న– ఎన్టీఆర్‌ను స్త్రీలోలునిగా చిత్రించే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆయన ఫొటోలకు ఎందుకు దండలు వేస్తున్నట్టు? 1982లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చి తిష్ట వేసినవారు చంద్రబాబు. ఒక పథకం ప్రకారం పార్టీలోని అనుభవజ్ఞులకు వంచనతో ఉద్వాసన పలికారు. ‘ఏదో ఒకనాడు ఇతడు ఎన్టీఆర్ స్థానాన్ని ఆక్రమించడానికి ఆయనను చంపనయినా చంపుతాడు’అంటూ ఆ సమయంలోనే నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి గుర్తు చేసుకోవాలి. చంద్రబాబుకు ఎన్టీఆర్ కేబినెట్ హోదాతో కూడిన కర్షక పరిషత్ నేతృత్వం కట్టబెట్టారు. కోర్టు మూడుసార్లు తిరస్కరించడంతో అప్పటివరకు ఎన్టీఆర్ సాధించుకున్న మంచిపేరుకు కూడా గ్రహణం పట్టింది. ఆపై పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రబాబు చేజిక్కించుకున్నారు. ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం మొదలుపెట్టారు. అవినీతి విధానాలకు బాటలు పరిచారు. దీని ప్రభావం 1989 ఎన్నికల మీద కనిపించింది. పార్టీ ఓడిపోయింది. 1994లో 74 ఏళ్ల ఎన్టీఆర్ ఆయన భార్య వెంట ఉండగానే ఎన్నికల బరిలో దిగారు. ఎంతో కష్టించారు. 294 స్థానాలలో, మిత్రపక్షాలతో కలసి 258 చోట్ల విజయకేతనం ఎగురవేశారు. ఇదొక చరిత్ర. ఈసారి కూడా ఆర్థిక, రెవెన్యూ శాఖలనే కాకుండా, అదనంగా విద్యుత్ శాఖను కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు. ఇదంతా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధించడానికే. పార్టీకి చంద్రబాబు చేసిందేమీ లేదు. కానీ ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. హెరిటేజ్ స్థాపన కూడా అవినీతి సొమ్ముతోనే జరిగింది. పెరాల్టిక్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసరా కోసం ఒక స్త్రీని జీవితంలోకి ఆహ్వానిస్తే, ఆమెనే బాబు బూచిగా చూపించి, ఎల్లో మీడియా సాయంతో చరిత్ర మరువలేని కుట్రను అమలు జరిపారు. ఎనిమిది నెలలు తిరగకుండానే ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆగస్ట్ 26, 1995 న వైస్రాయ్ హోటల్ ముందు జరిగిన ఘోరం మరువలేనిది. ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరారు. కుంగిన ఎన్టీఆర్ ఆగస్ట్ 30, 1995న ఆస్పత్రి పాలయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కళ్లనీళ్లు పెట్టుకుని ‘ఎన్టీఆర్ ఈరోజే చనిపోయాడు. నన్ను బ్రతికుండగానే సమాధి చేశాడు’అంటూ దుఃఖం పొంగి పొర్లుతుండగా అక్కడే మైకు తీసుకుని మాట్లాడిన సంఘటన ఎవరయినా మర్చిపోగలరా? చంద్రబాబు మీద పోరాటానికి సిద్ధపడ్డ ఎన్టీఆర్ ఫిబ్రవరి 1996లో ‘సింహగర్జన సదస్సు’ ఏర్పాటు చేస్తున్నానని, ప్రజలకు చంద్రబాబు నీతిమాలిన చర్యను తెలియజేస్తానని చెప్పారు. సదస్సు కోసం ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’లో తన పేరుతో ఉన్న పార్టీ సభ్యత్వ డబ్బును తీసుకురమ్మని జనవరి 17–1996న దేవినేని రాజశేఖర్‌కు చెక్కు ఇచ్చి పంపారు. కానీ చంద్రబాబు స్టే ఆర్డర్ తెచ్చి ఎన్టీఆర్‌కు ఆ హక్కు లేదని చెప్పించారు. ఆయన ఆగ్రహోదగ్రుడై,‘ఇతడు క్షమించటానికి వీల్లేని పెద్ద ద్రోహి’ అని అందరిముందే తిట్టారు. ఆ బాధ తట్టుకోలేక మరో 10 గంటల్లోనే ఎన్టీఆర్ గుండె ఆగిపోయింది. అదుపు తప్పిన బీపీ, షుగర్ వల్లనే అలా జరిగిందని డాక్టర్లు ప్రకటించారు. ఈ రాజకీయ హత్య చేసిందెవరు? 60 ఏళ్ల వయసులో పార్టీ పెట్టి, 70 ఏళ్ల వయసులో కూడా కష్టించి ఎన్టీఆర్ సాధించిన ప్రభుత్వాన్ని కబ్జా చేయడమే కాకుండా ఆయన మీద, ఆయన భార్యమీద నిందలు మోపటం ఎటువంటి అధమ రాజకీయం? ఇదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పన్నిన ఉచ్చులో సోనియా ఇరుక్కున్నారు. అడ్డమైన కేసులు పెట్టించి, జగన్‌ను జైలుకు పంపారు. 74 ఏళ్ల వయసులో సర్వం పోగొట్టుకుని ప్రాణాల్నే విడచిన నా భర్త నందమూరి తారక రామారావును దుఃఖంతో స్మరించుకునే జనవరి 18వ తేదీని చంద్రబాబు నికృష్ట రాజకీయానికి ప్రతిరూపంగా పరిగణించాలి. ఇప్పటికీ ఎన్టీఆర్‌ను స్త్రీలోలుడిగా చిత్రీకరిస్తూ బతుకుతున్న చంద్రబాబు నీచ రాజకీయానికి శాశ్వత సమాధి కట్టండి– అదే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి– ప్రశాంతి. అశ్రునయనాలతో...(నేడు ఎన్టీఆర్ 22వ వర్ధంతి) డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త సాహితీవేత్త, వైఎస్సార్సీపీ నాయకురాలు -
'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'
-
'తాత గురించి ఎంత చెప్పినా తక్కువే'
హైదరాబాద్ : తాత గురించి ఎంత చెప్పినా తక్కువేనని హీరో జూ.ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ తాత అడుగుజాడల్లో నడుస్తామన్నారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఎన్టీఆర్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాజీ రాజ్యసభసభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. నివాళులర్పించిన వారిలో హీరో కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. -
నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను!
చంద్రబాబు నినాదం కోడి కూతై అనేక జంటల్ని నిద్రలేపింది. శుభప్రదమైన, సుఖప్రదమైన నినాదం! పైగా ఆకర్షణీయం, ఆచరణసాధ్యం. పూర్తిగా సొంతింటి పరిజ్ఞానంతో నడిచే ఈ కుటీర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని మేకినిండియా పిలుపునకిది సరైన జవాబుగా నిలుస్తుంది. పుష్కరం కిందట చంద్రబాబు స్లోగన్ ఇది. అప్పట్లో అధికార యంత్రాంగానికి ఇచ్చిన నినాదం ఇది. ఇప్పుడు సరిగ్గా ఎన్టీఆర్ వర్ధంతి రోజు చంద్రబాబుకి ‘మారు మన సు’ అయింది. జాతికి అన్న గారు, బాబుకి మామగారు అయిన ఎన్టీఆర్ పూనారు. కనండి! కనండి! పిల్లల్ని యథేచ్ఛగా కనండి! కరువు తీరా కనండి! కళకళలాడా కనండి! కేరింతలతో రాష్ట్రాన్ని బాలాంధ్రప్రదేశ్గా మార్చండి! దేశమంటే పిల్లలోయ్! తెలుగుదేశమంటే ఓటొచ్చిన పిల్లలోయ్- నూతనోత్సా హంతో ముఖ్యమంత్రి నినదించారు. అసలే చలి ఎక్కు వగా ఉన్న సంక్రాంతి వేళ నేత ఇచ్చిన పిలుపు సమర్థు లకు వెచ్చగా అనిపించింది. ఆనాడు హైదరాబాద్ నగరానికి గడ్డ ఎత్తుతూ తొలి నవాబ్, ‘నా నగరంలో మనుషులు చెరువులో చేపల్లాగ కుప్పలు తెప్పలుగా పెరగాలి. ఆ విధంగా దీవించ’మని అల్లాని వేడుకున్నాడు. భాగ్యనగరం చేపల చెరువు కంటే ఎక్కువగా కిక్కిరిసింది అల్లా దయవల్ల. అన్నగారు కుటుంబ నియంత్రణకు ఎప్పుడూ వ్యతిరేకమే. ఎవరైనా తమకు పిల్లలు ఇద్దరనో ముగ్గురనో చెబితే చురుక్కున చూసి ‘‘ఏం బ్రదర్! వాట్ హ్యాపెండ్? ఏమైంది? దానికీ బద్ధకమేనా? నియంత్రణా? పశువుకీ పక్షికీ చెట్టుకీ చేమకీ లేని కంట్రోల్ మనకేల? పర్యావరణాన్ని పాడు చేయకండి!’’ అని హెచ్చరించేవారు. కనీసం పద మూడు, పద్నాలుగు మందిని కనాలి. అప్పుడే పరమ హంస స్టేటస్ వస్తుంది. మమ్మల్ని చూడండి! అనేవారు. ఇదే సందేశంతో తాతమ్మ కల సినిమాలో పాట కూడా పెట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి, రవీంద్రనాథ్ టాగూర్ అధిక సంతానం వద్దనుకుంటే పుట్టేవారే కారని చెప్పిం చారు. ఎంతైనా ఎన్టీఆర్ కార్యశూరుడు. నిన్నటిదాకా ‘వన్ ఆర్ నన్’ అన్నారు. హద్దు మీరితే పదవులకి అనర్హులని నిఘా పెట్టారు. ఎమర్జెన్సీ లో అయితే యువరాజు సంజయ్‌బాబు ఆధ్వర్యంలో పదేళ్ల వాళ్లకి కూడా ఆపరేషన్లు చేసేశారు. జాతిని ఒక తరంపాటు నిర్వీర్యం చేసేశారు. ‘‘మొన్నటి దాకా క్రాప్ హాలిడే అని, ఇవాళ ఉన్నట్టుండి ‘స్టార్ ప్రొడక్షన్’అంటే- ఇది లాకులెత్తి నీళ్లొదిలినంత సులువా?’’ అంటున్నారు కొందరు. ఎంతైనా క్రియేటివ్ పనికి వేళావేళలూ, కళా కళలు ఉంటాయి కదా! పిచ్చి కుదిరింది, తలకి రోకలి చుట్టమంటే?! ఇది చంద్రబాబు రాజకీయం అంటు న్నారు కొందరు మేధావులు. ఇప్పుడీ భరోసా మీద వచ్చే వారంతా ‘తెలుగుదేశం పిల్లలు’గా టీడీపీకి విధే యులై ఉంటారనీ, ఇరవయ్యేళ్ల తరువాత వారంతా లోకేష్ ఓటర్లు అవుతారనీ, ఇది బాబు విజన్ 2035 అనీ వాదిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నినాదం కోడి కూతై అనేక జంటల్ని నిద్ర లేపింది. శుభప్రదమైన, సుఖ ప్రదమైన నినాదం! పైగా ఆకర్షణీయం, ఆచరణ సాధ్యం. పూర్తిగా సొంతింటి పరిజ్ఞానంతో నడిచే ఈ కుటీర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థి ల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రధాని మేకినిం డియా పిలుపుకిది సరైన జవాబుగా నిలుస్తుంది. అసలే మన బాబు టెక్నాలజీ బాబు. అందుకని ఆర్నెల్లకే పంట కొచ్చే హైబ్రిడ్ పిల్లల కోసం; కవలలూ, క్వాడ్రుప్లేట్స్ కోసం వ్యాక్సిన్ చేయించినా ఆశ్చర్యం లేదు. ఇదొక పోటీగా పరిణమిస్తే ప్రమాదం. మేం తక్కు వ తిన్నమా, మాకూ మగాళ్లున్నారు. మూడేళ్లలో జనా భాను డబుల్ చేస్తాం. కాస్కోండి దద్దమ్మల్లారా! అంటూ రంగప్రవేశం చేస్తే!? అవసరమైతే క్షేత్రస్థాయిలో బీజ స్థాయిలో అహరహం యుద్ధ ప్రాతిపదికన పనులు నడి పిస్తాం. రెండు తర్వాత సంక్రమించే గర్భాలకు అంటే ఆ తల్లులకు సంతానలక్ష్మి పథకం కింద పింఛన్ ఏర్పా టు చేస్తాం. ఎర్ర త్రికోణాన్ని తిరగేసి రంగు తగ్గిస్తాం. ఇం కానా, ఇకపై కుట్రలు సాగవ్. ప్రతివాడూ ఒక ఉగ్ర నర సింహుడై విజృంభిస్తాడు! ఖబడ్దార్! శాంతిః శాంతిః శాంతిః (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
నువ్వొస్తానంటే.. నేను ఊరుకుంటానా!?
సాక్షి ప్రతినిధి నల్లగొండ : జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య అంతర్గత పోరు మళ్లీ రచ్చకెక్కుతోంది. మోత్కుపల్లి తీరు వల్లనే పార్టీలో వర్గపోరు రాజుకుంటుందని ఆ పార్టీ నాయకులే మదనపడుతున్నారు. సఖ్యతగా ఉంటున్నామని గాంభీర్యంగా చెబుతున్నప్పటికీ సమయం వచ్చినప్పుడల్లా వారి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మేళ్లచెర్వులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కొందరు నాయకులు హాజరుకాకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది. పార్టీ శ్రేణులు నిర్వేదంతో నిండిపోయాయి. వాస్తవానికి ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేళ్లచెర్వులో విగ్రహావిష్కరణకు ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఆయన హాజరవుతున్నట్లు నిన్నటివరకు సంకేతాలు కూడా అందాయి. కానీ రాత్రికి రాత్రే జరిగిన పరిణామాల ప్రభావం వల్ల ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. మోత్కుపల్లి నర్సింహులు అభ్యంతర పెట్టడం వల్లనే రేవంత్‌రెడ్డి గైర్హాజరయ్యారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జిల్లాలో ఆది నుంచి టీడీపీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఉమామాధవరెడ్డి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా మరో వర్గానికి మోత్కుపల్లి నర్సింహులు నాయకుడిగా వ్యవహరించారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేయడంతో వారి మధ్య విభేదాలు ఇంతకాలం నివురుగప్పిన నిప్పు లా ఉన్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమం లో ఉమామాధవరెడ్డితోపాటు ఇంతకాలం మోత్కుపల్లి వర్గం నాయకుడిగా గుర్తింపు ఉన్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వంగాల స్వామిగౌడ్ కూడా హాజరుకావడంతో పలువురు నాయకులు ప్లేటు ఫిరాయించినట్లు చర్చించుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్తో పాటు వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు పాల్వాయి రజినికుమారి, బంటు వెంకటేశ్వర్లు, చిలువేరు కాశీనాథ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ నాయకులు నెల్లూరు దుర్గాప్రసాద్, రౌతు వెంకటేశ్వర్రావులు హాజరయ్యారు. మోత్కుపల్లి నాయకత్వాన్ని జిల్లాలోని పలువురు నాయకులు వ్యతిరేకిస్తుండడం గతంలోనే పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా బయటపడింది. జిల్లాను వదిలి ఖమ్మం వలస వెళ్లిన మోత్కుపల్లి మధిరలోనే పార్టీ ఇంచార్జి బాధ్యతలు నిర్వహించాలని పలువురు నేతలు జిల్లాలో ఆయన జోక్యాన్ని వ్యతిరేకించారు. మళ్లీ ఆయన జిల్లాలో పార్టీ విషయాల్లో వేలు పెట్టరాదనిఅధినాయకత్వానికి సూచించారు. మరో మారు కింగ్‌మేకర్‌గా జిల్లాలో చక్రం తిప్పాలనుకున్న ఆశలు అడియాసలు కావడమే కాకుండా తన గ్రూపులో ఉన్న స్వామిగౌడ్ లాంటి వారు చేజారడంతో తనదైన శైలిలో స్పందించి రేవంత్‌రెడ్డి పర్యటనకు అడ్డు చెప్పారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ పెట్టదు... అడుక్కుతిననివ్వదు అన్నట్లు... పార్టీ తీరు మారిందని శ్రేణులు డోలాయమానంతో డీలా పడిపోయాయి. -
ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పునరంకితం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్దనివాళులర్పించిన బాబు, కుటుంబసభ్యులు సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆశయాల సాధనకు పునరంకితమవుతామని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, కొడుకు లోకేశ్, కోడలు బ్రహ్మణి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ పేదల కోసం ఎన్టీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ప్రజలు ఆయన్ని మరచిపోరని చెప్పారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని చెప్పారు. భావితరాలకు ఆయన ఆదర్శప్రాయం కావాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు ఎన్టీఆర్ఘాట్ వద్ద నివాళులర్పించినవారిలో ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఆర్థికశాఖ మం త్రి యనమల రామకృష్ణుడు తదితరులున్నారు. -
'బాబు పాలన చూసి ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుంది'
-
'చంద్రబాబు పాలన చూసి ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుంది'
హైదరాబాద్: ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లేకపోవడం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఉండి ఉంటే తెలుగుజాతి రెండుగా చీలేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు పాలన చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. రాష్ట్రానికి స్మార్ట్‌సిటీలు అక్కర్లేదు... పేదలకు పట్టెడన్నం కావాలని లక్ష్మీపార్వతి అన్నారు. -
ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: జూనియర్ ఎన్టీఆర్
-
ఎన్టీఆర్ సమైక్యవాదా.. విభజనవాదా?
ఎన్టీఆర్ వర్ధంతిని కూడా తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా తన ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయాలకు ఉపయోగించుకుంది. రెండు ప్రాంతాలకు చెందిన నాయకులు అక్కడకు వచ్చి, పెద్దాయనకు నివాళులు అర్పించి, తమకు తోచిన రీతిలో ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఇప్పుడు మాత్రం కొంతమంది తమ స్వార్థం కోసం తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మరోవైపు పార్టీ తెలంగాణ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి, ఎన్టీఆర్ బతికుంటే ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయి ఉండేదని చెప్పారు. పరిపాలన సౌలభ్యంకోసమే మండల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఇంతలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికొచ్చి, ఎన్టీఆర్ బతికుంటే అసలు రాష్ట్ర విభజన అంశమే తెరమీదకు వచ్చేది కాదని చెప్పారు. తాము ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. పనిలోపనిగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: జూనియర్ ఎన్టీఆర్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదని టాలీవుడ్ హీరో, సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ లాంటి యుగపురుషుడు మళ్లీ పుట్టబోరని ఆయన అన్నారు. నందమూరి తారక రామారావు 18వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు హరికృష్ణ, రామకృష్ణ, జయకృష్ణ, మనవలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ కొడుకుగా పుట్టడం తన అదృష్టమని హరికృష్ణ అన్నారు. ఒక వ్యక్తిగా, సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని, తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని ఆయన చెప్పారు. అయితే, కొందరు తమ స్వార్థం కోసం తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ సందర్భంగా హరికృష్ణ మండిపడ్డారు.