
'చంద్రబాబు పాలన చూసి ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుంది'
హైదరాబాద్: ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లేకపోవడం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఉండి ఉంటే తెలుగుజాతి రెండుగా చీలేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఆనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏడు నెలల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు పాలన చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. రాష్ట్రానికి స్మార్ట్సిటీలు అక్కర్లేదు... పేదలకు పట్టెడన్నం కావాలని లక్ష్మీపార్వతి అన్నారు.