సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, అటువంటి వ్యక్తికి భారతరత్న రావడం చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గురువారం ఉదయం ఆమె ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు చివరి రోజుల్లో అన్యాయం జరిగిందని, బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లో వెన్నుపోటు గురించి చెప్పాలని అన్నారు.
తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్‌ను పట్టించుకోని ఆ మహాసభలకు బాలకృష్ణ ఎందుకు వెళ్లారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని అన్నారు. అ అలాగే ఎన్టీఆర్ పేరు లేకుండా చేసేందుకే సంక్షేమ పథకాలకు చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment