ఎన్టీఆర్ వర్ధంతిని కూడా తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా తన ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయాలకు ఉపయోగించుకుంది. రెండు ప్రాంతాలకు చెందిన నాయకులు అక్కడకు వచ్చి, పెద్దాయనకు నివాళులు అర్పించి, తమకు తోచిన రీతిలో ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఇప్పుడు మాత్రం కొంతమంది తమ స్వార్థం కోసం తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మరోవైపు పార్టీ తెలంగాణ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చి, ఎన్టీఆర్ బతికుంటే ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయి ఉండేదని చెప్పారు. పరిపాలన సౌలభ్యంకోసమే మండల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారని ఆయన అన్నారు.
ఇంతలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర అక్కడికొచ్చి, ఎన్టీఆర్ బతికుంటే అసలు రాష్ట్ర విభజన అంశమే తెరమీదకు వచ్చేది కాదని చెప్పారు. తాము ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. పనిలోపనిగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ సమైక్యవాదా.. విభజనవాదా?
Published Sat, Jan 18 2014 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement