లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర డీజీపీ ముకుల్ గోయల్‌ను అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించారు.
ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ డీజీపీ పదవి నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది జూన్‌లోనే యూపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు ముకుల్ రాయ్.
ప్రస్తుతం డీజీపీ పోస్ట్ నుంచి ముకుల్ గోయల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపించారు. ఇంటెలిజెన్స్ డీజీ డీఎస్ చౌహాన్ యూపీకి తర్వాతి డీజీపీ అయ్యే అవకాశం ఉంది. 1987 ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ముకుల్ గోయల్.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్‌ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2007లో మాయావతి సర్కార్ ముకుల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment