
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్‌ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్‌లో పిచిత్ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్‌లాండ్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment