Formula E World Championship
-
హైదరాబాద్ ‘ఫార్ములా’ అదిరింది
ఒకవైపు 320 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకుపోతున్నాయి... మరోవైపు అంతే రేంజ్లో ఫ్యాన్స్ ఉత్సాహం, ఉత్కంఠ... ఒకవైపు వీఐపీ బాక్స్‌లో నుంచి సెలబ్రిటీలు రేస్‌ను ఆస్వాదిస్తుండగా... మరోవైపు గ్యాలరీల్లో ఉన్న సాధారణ అభిమానుల హోరుతో పరిసరాలు దద్దరిల్లుతున్నాయి... రెప్పపాటులో ట్రాక్‌పై జూమ్మంటూ జనరేషన్ ‘3’ కార్లు పరుగులు తీయగా... దాదాపు గంట పాటు హుస్సేన్ సాగర్ తీరం ప్రపంచ పటంపై కనువిందు చేసింది. న్యూయార్క్, బెర్లిన్, బీజింగ్, రోమ్, జ్యూరిక్... ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్‌కు ఆతిథ్యం ఇస్తున్న నగరాల్లో కొన్ని. ఇప్పుడు హైదరాబాద్ కూడా వీటి సరసన చేరింది. కొత్తగా వచ్చిన క్రీడతో ‘స్ట్రీట్ సర్క్యూట్’ వద్ద అన్ని రకాలుగా కొత్త తరహా వాతావరణం కనిపించింది. ఫార్ములా ‘ఇ’ రేస్ విజయవంతమైందన్న సంకేతాన్ని చాటింది. ఈ హోరాహోరీ సమరంలో చివరకు డీఎస్ పెన్స్కే జట్టు డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. సాక్షి, హైదరాబాద్: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఫార్ములా ‘ఇ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటు ప్రేక్షకాదరణతో పాటు ఇటు నిర్వాహకుల వైపు నుంచి కూడా సూపర్ సక్సెస్‌గా ప్రశంసలందుకుంది. ఫార్ములా ‘ఇ’ 9వ సీజన్లో భాగంగా హైదరాబాద్‌లో శనివారం నాలుగో రేస్ ముగిసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రూపొందించిన ‘స్ట్రీట్ సర్క్యూట్’పై 22 మంది పోటీ పడిన ఈ రేస్‌లో డీఎస్ పెన్స్కే టీమ్‌కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. 33 ల్యాప్లతో 2.83 కిలోమీటర్లు ఉన్న ట్రాక్‌పై సాగిన ఈ రేస్‌ను వెర్నే అందరికంటే వేగంగా 46 నిమిషాల 01.099 సెకన్లలో పూర్తి చేశాడు. ఎన్విజన్ రేసింగ్ డ్రైవర్ నిక్ కాసిడీ రెండో స్థానంలో, పోర్‡్ష టీమ్ డ్రైవర్ ఫెలిక్స్ డి కోస్టా మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన మహీంద్రా టీమ్ డ్రైవర్ ఒలివర్ రోలండ్కు ఆరో స్థానం దక్కింది. 29 పాయింట్లతో పెన్స్కే ‘టీమ్ చాంపియన్’గా నిలిచింది. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు... రన్నరప్ నిక్ క్యాసిడీకి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్లో భాగంగా ఐదో రేస్ ఈనెల 25న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతుంది. హైదరాబాద్ రేస్ విశేషాలు... ► వెర్నే రేస్ పూర్తి చేసే సమయానికి అతని కారులో 0.5 శాతం ఎనర్జీ మాత్రమే మిగిలి ఉంది. ► ఎన్విజన్ డ్రైవర్ సెబాస్టియన్ బ్యూమీ మూడో స్థానంలో నిలిచినా... ‘ఓవర్ పవర్’ ఉపయోగించినందుకు 17 సెకన్ల పెనాల్టీ విధించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ► మహీంద్రా టీమ్ డ్రైవర్లలో రోలండ్ ఆరో స్థానంలో, డి గ్రాసి 14వ స్థానంలో నిలిచారు. ► జాగ్వార్ టీమ్‌కు చెందిన ఇద్దరు డ్రైవర్లు మిచ్ ఇవాన్స్, స్యామ్ బర్డ్ ఒకరినొకరు ట్రాక్‌పై ‘ఢీ’ కొట్టుకున్నారు. దాంతో ఇద్దరూ రేస్‌ను పూర్తి చేయలేకపోయారు. ► మూడో స్థానంలో నిలిచిన మాజీ విజేత డి కోస్టాకు ఇది 100వ రేస్ కావడం విశేషం. ► పెన్స్కే టీమ్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ స్టాఫెల్ వండూర్న్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ► 23వ ల్యాప్‌లో మెక్లారెన్ డ్రైవర్ జేక్ హ్యూజెస్ కారు స్టీరింగ్ జామ్ అయి ఆగిపోవడంతో సేఫ్టీ కారును తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అతనూ రేస్ పూర్తి చేయలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు. హైదరాబాద్ ‘ఇ’ రేసు ఫలితాలు (టాప్–10): 1. జీన్ ఎరిక్ వెర్నే (డీఎస్ పెన్స్కే; 46ని:01.099 సెకన్లు), 2. నిక్ క్యాసిడీ (ఎన్విజన్; 46ని:01.499 సెకన్లు), 3. ఫెలిక్స్ డి కోస్టా (పోర్‡్ష; 46ని: 02.958 సెకన్లు), 4. వెర్లీన్ (పోర్‡్ష; 46ని: 03.954 సెకన్లు), 5. సెటె కెమారా (నియో 333 రేసింగ్; 46ని: 04.622 సెకన్లు), 6. రోలండ్ (మహీంద్రా; 46ని: 08.237 సెకన్లు), 7. నార్మన్ నాటో (నిస్సాన్; 46ని: 08.417 సెకన్లు), 8. స్టాఫెల్ వాన్డూర్న్ (డీఎస్ పెన్స్కే; 46ని: 08.663 సెకన్లు), 9. లాటరర్ (అవలాంచె; 46ని: 9.802 సెకన్లు), 10. మొర్టారా (మసెరాటి; 46ని: 10.172 సెకన్లు). -
ముగిసిన ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్ షిప్
-
హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్ ముగిసింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్షిప్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్నే(డీఎస్ పెన్స్కే రేసింగ్) నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ(ఎన్విజన్ రేసింగ్), మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి(ఎన్విజన్ రేసింగ్) ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా-ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. 2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న ఫార్ములా-ఈ తొలి రేసుకు మన హైదరాబాద్ వేదికైంది. దీనికి తోడు ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ చోటు దక్కించుకుంది. హుసేన్సాగర్ తీరప్రాంతంలో 2.8కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు తమ కార్లను పరుగులు పెట్టించారు. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. రేసింగ్‌లో విదేశీ కంపెనీలు, రేసర్లదే హవా కాగా, భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగడం గర్వంగా అనిపించింది. -
ఫార్ములా రేస్ వద్ద సెలబ్రిటీల సందడి
-
హైదరాబాద్‌లో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది: ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ జరగనుండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వహణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని ప్రభాస్ కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. బుక్‌మై షోలో టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తున్నా: మహేశ్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. హైదరాబాద్‌కు ఫార్మూలా రేస్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు మహేశ్. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలంశెట్టిని కూడా మహేశ్‌బాబు ప్రశంసించారు. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు వివరించారు. ఈ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. బుక్‌మై షోలో టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. Let's race against climate change! Congratulations @KTRTRS garu, @TelanganaCMO, & Anil Chalamalasetty garu on bringing #FormulaE to Hyderabad! Looking forward to #GreenkoHyderabadEPrix on Feb 11th!@HMDA_Gov @AceNxtGen pic.twitter.com/Lwf1I9T8Cp — Mahesh Babu (@urstrulyMahesh) January 24, 2023 -
కేటీఆర్‌ను అభినందించిన మెగాస్టార్.. ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. హైదరాబాద్‌కు ఫార్మూలా ఈ రేస్ తీసుకురావడం పట్ల ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలంశెట్టిని కూడా చిరు ప్రశంసించారు. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. బుక్‌మై షోలో టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. My best wishes to dear @KTRTRS and Anil Chalamalasetty (Gopi) for bringing #FormulaE to #India & #Hyderabad. Let’s make history on February 11, 2023 at the #GreenkoHyderabadEprix by accelerating towards a future of #Sustainability and #Decarbonization. @AceNxtGen @KTRoffice — Chiranjeevi Konidela (@KChiruTweets) January 17, 2023 -
HYD: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ జరుగనుంది. 227 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్‌కి FIA లైన్ క్లియర్ చేసింది. దీంతో, ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ బుధవారం ఈవెంట్స్ టికెట్స్‌ను లాంచ్ చేశారు. కాగా, ఈ రేసింగ్ కోసం నేటి నుంచి బుక్‌మై షోలో టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. 2023 హైదరాబాద్ E-prix పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. ఇక, అందుబాటులో 22,500 టికెట్స్ ఉన్నట్టు పేర్కొన్నారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. -
‘ఫార్ములా ఈ రేసింగ్’కు హైదరాబాద్ ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా ఈ ఛాంపియన్షిప్’లో భాగంగా జరిగే ‘ఫార్ములా ఈ రేసింగ్’ (ఈ–ప్రిక్స్)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఈ రేసింగ్ కు ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ తాజాగా ఆమోదం తెలిపింది. ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ (సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ వాహనాలకు నిర్వహించే పోటీలు) తొమ్మిదో సీజన్ కేలండర్‌ను రెండు రోజుల క్రితం కౌన్సిల్ ఖరారు చేసింది. నగరానికి అవకాశం లభించడంతో ఈ–ప్రిక్స్ నిర్వహణకు భారత్‌లో ఎంపికైన తొలి నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు లభించింది. ఈ–ప్రిక్స్ నిర్వహణ ద్వారా ప్రపంచ మోటార్ స్పోర్ట్స్ చిత్రపటంలో భారత్‌కు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. 2.37 కిలోమీటర్ల పొడవు..8 మలుపులు 2.37 కిలోమీటర్ల పొడవులో మొత్తం 8 మలుపులు, మూడు సెక్టార్లుగా విభజించి నెక్లెస్ రోడ్డుపై రేసింగ్‌ను నిర్వహిస్తారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ ఈవెంట్ జరిగే నాటికి రేసింగ్‌కు అనుగుణంగా రహదారిని పూర్తిగా సిద్ధం చేస్తామని ఓ అధికారి వివరించారు. ఈ–ప్రిక్స్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో ‘ఫార్ములా ఈ’తో కుదిరిన అవగాహన పత్రంపై తెలంగాణ సంతకం చేసింది. ఇదిలా ఉంటే 2011 నుంచి 2013 వరకు వరుసగా మూడేళ్ల పాటు భారత్‌లోని బుద్ద ఇంటర్నేషనల్ సరŠూయ్యట్ ఫార్ములా వన్ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వగా, మరోసారి అతిపెద్ద ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్ చాంపియన్‌షిప్ పోటీలు భారత్‌లో జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 18 రేస్‌లు ఈ ప్రిక్స్ ఛాంపియన్షిప్ తొమ్మిదో సీజన్లో భాగంగా వచ్చే ఏడాది జూలై వరకు మొత్తం 18 రేస్‌లు ప్రపంచం లోని వివిధ నగరాల్లో జరుగుతాయి. 2014లో ఈ ఛాంపియన్షిప్ ప్రారంభం కాగా.. ఏడేళ్ల తర్వాత 2020–21 నుంచి ఈ పోటీలకు ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్ హోదాకు ఆమోదం లభించింది. ఈ ఛాంపియన్షిప్ మొదట్నుంచే మహీంద్రా రేసింగ్ ఇందులో భాగస్వామిగా ఉంటూ వస్తోంది. తొలినాళ్లలో కరుణ్ చందోక్ అనే భారతీయుడు ఈ–ప్రిక్స్‌లో పాల్గొన్నాడు. వీధుల్లో జరిగే ఈ–ప్రిక్స్ రేస్‌లు ఫార్ములా వన్ రేసులు ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్లలో జరుగుతాయి. అయితే ఈ–ప్రిక్స్ రేస్‌లు మాత్రం పెద్ద నగరాల్లోని వీధుల్లో జరుగుతాయి. ఈ రేస్‌లు మోటార్ స్పోర్ట్ అభిమానులకు వినోదం పంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదం చేస్తాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నాలతోనే హైదరాబాద్‌లో ఈ–ప్రిక్స్ జరగనుందని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా మొబిలిటీ రంగంలో అభివృద్ధి చెందాలనుకునే ఎంట్రప్రెన్యూర్స్‌తో పాటు ఫిన్‌టెక్, మెడ్‌టెక్ రంగాలకు ఇది అతిపెద్ద అవకాశమని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా తెలంగాణ ప్రభుత్వానికి.. ప్రత్యేకించి మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకో తెలుసా?.. తన చిరకాల స్వప్నం నెరవేర్చినందుకు! అవును.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్ ఛాంపియన్షిప్ రేసు కోసం హైదరాబాద్ నగరం వేదికగా ఇవాళ ఖరారైంది. ఈ తరుణంలో సొంత రేసింగ్ కార్లను(మహీంద్రా రేసింగ్ కంపెనీ) స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు కృతజ్ఞతగా ఆనంద్ మహీంద్రా కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు. సొంత గడ్డపై తమ రేసింగ్ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. We were one of the founding teams in Formula E and a long held dream of @MahindraRacing has been to race our cars on home ground, cheered on by a home crowd. Thank you @KTRTRS for taking a huge step towards making that dream a reality! We can’t wait… https://t.co/HF9OoVDVXO — anand mahindra (@anandmahindra) January 17, 2022 ఫార్ములా E సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- మంత్రి కేటీఆర్ సంయుక్తంగా ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. పనిలో పనిగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న మద్దతును సైతం అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే ఫార్ములా వన్ తరహాలో ఇ-వన్ ఛాంపియ్‌షిప్ కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నదే. ఈ రేసింగ్ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్ ట్రాక్ అక్కర్లేని ఈ ‘ఇ వన్ ఫార్ములా’ ఛాంపియన్షిప్ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంలో మహీంద్రా రేసింగ్ కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది. In the presence of Minister @KTRTRS, the Govt. of Telangana and @FIAFormulaE entered into an agreement to make Hyderabad as host city. #HappeningHyderabad pic.twitter.com/E3HLJPV2Xm — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 17, 2022 ఇప్పటి వరకు లండన్, న్యూయార్క్, మెక్సికో, రోమ్, బెర్లిన్, రోమ్, సియోల్, వాంకోవర్ నగరాల్లో ఈ పోటీలు జరిగాయి. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్ నగరం ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సంబంధిత వార్త: ఫార్ములా ఇ- వన్ ఛాంపియన్షిప్.. ఇట్ హ్యాపెన్స్