ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తున్నా: మహేశ్‌ బాబు | Mahesh Babu Tweet On Hyderabad Formula E Race | Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తున్నా: మహేశ్‌ బాబు

Published Tue, Jan 24 2023 8:04 PM | Last Updated on Tue, Jan 24 2023 9:10 PM

Mahesh Babu Tweet On Hyderabad Formula E Race - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మంత్రి కేటీఆర్‌ను అభినందించారు.  హైదరాబాద్‌కు ఫార్మూలా రేస్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు మహేశ్. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరగడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. 

అలాగే గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలంశెట్టిని కూడా మహేశ్‌బాబు ప్రశంసించారు. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్‌ కో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు వివరించారు. ఈ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా..  ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.  బుక్‌మై షోలో  టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్‌ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్‌ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌ రేసింగ్‌ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్‌ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement