మెగాస్టార్ చిరంజీవి మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. హైదరాబాద్‌కు ఫార్మూలా ఈ రేస్ తీసుకురావడం పట్ల ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలంశెట్టిని కూడా చిరు ప్రశంసించారు. ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా.. ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. బుక్‌మై షోలో టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ రేసింగ్ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు.
My best wishes to dear @KTRTRS and Anil Chalamalasetty (Gopi) for bringing #FormulaE to #India & #Hyderabad.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 17, 2023
Let’s make history on February 11, 2023 at the #GreenkoHyderabadEprix
by accelerating towards a future of #Sustainability and #Decarbonization. @AceNxtGen @KTRoffice
Comments
Please login to add a commentAdd a comment