హైదరాబాద్‌లో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది: ప్రభాస్ | Hero Prabhas Congratulates KTR For Formula E Race In Hyderabad | Sakshi
Sakshi News home page

Prabhas:హైదరాబాద్‌లో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది: ప్రభాస్

Jan 28 2023 4:16 PM | Updated on Jan 28 2023 4:22 PM

Hero Prabhas Congratulates KTR For Formula E Race In Hyderabad - Sakshi

రెబల్ స్టార్ ప్రభాస్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ జరగనుండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ రేస్ నిర్వహణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్‌ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని ప్రభాస్ కొనియాడారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ఫిబ్రవరి 11న జరగనున్న గ్రీన్‌ కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా..  ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ జరుగనుంది. ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.  బుక్‌మై షోలో  టికెట్స్‌ను కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచించారు. 2023 హైదరాబాద్‌ ఈ ప్రిక్స్ (E-prix) పేరుతో ఈవెంట్‌ జరుపనున్నట్టు స్పష్టం చేశారు. కేటగిరిలా వారీగా ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌ రేసింగ్‌ టికెట్ల ధరలు ఉంటాయని తెలిపారు. రేసింగ్‌ టికెట్ల ధరలు.. రూ. 1000, రూ. 3,500, రూ. 6వేలు, రూ.10వేలుగా నిర్ణయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement