![Anand Mahindra Fia farmula race tweets video here is Ktr response - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/3/anand%20mahindra.jpg.webp?itok=5g0MyO5s)
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ రేస్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి 12, న FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ద ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించోబోతోంది.
దీనిపై పారిశశ్రామిక వేత్త ఆనంద్‌మహీంద్ర ట్విటర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 8 సంవత్సరాల రేసింగ్ తర్వాత, దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రేసింగ్ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే టైటిల్ స్పాన్సర్ గ్రీన్‌కో రేసును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కూడా ఆనంద్ మహీంద్రకు ధన్య వాదాలు తెలిపారు.
మాతృ సంస్థలో మహీంద్రా ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ వాహన విభాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ తమలో విలీనమైందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆమోదం లభించిందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, తయారీ, విక్రయ కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి విలీనం చేసినట్టు మహీంద్రా స్పష్టం చేసింది.
Welcome to Hyderabad Anand Ji 🏎️ https://t.co/b2IFjMpmBg
— KTR (@KTRBRS) February 3, 2023
Comments
Please login to add a commentAdd a comment