HyderabadEPrix వారిద్దరినీ కలవడం అద్భుతం: మెగా పవర్‌ స్టార్‌ | HyderabadEPrix wonderful meet mahindra Gurnani thanks to KTR says Hero ram charan | Sakshi
Sakshi News home page

HyderabadEPrix వారిద్దరినీ కలవడం అద్భుతం: మెగా పవర్‌ స్టార్‌

Published Fri, Feb 10 2023 1:14 PM | Last Updated on Fri, Feb 10 2023 1:17 PM

HyderabadEPrix wonderful meet mahindra Gurnani thanks to KTR says Hero ram charan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహేంద్ర రేసింగ్ లో  మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను, టెక్‌ మహీంద్ర సీఎండీ సీపీ గుర్నాని కలవడం అద్భుతంగా ఉందంటూ  మెగా పవర్‌ స్టార్‌  రాం చరణ్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు అంతకంటే అద్భుతమైన పిక్స్‌ను షేర్‌ చేశారు. 

ఫార్ములాఈ రేసింగ్‌లో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తెలంగాణా మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.

 

కాగా హుస్సేన్ సాగర్ ఒడ్డున ఫార్ములా ఈ కార్లు రేపు పరుగులు తీయనున్నాయి. ఈ రేసులో భారత సంస్థ మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఫార్ములా-ఈ రేసింగ్‌లో పాల్గొనే తమ జనరేషన్-3 ఫార్ములా-ఈ రేస్ కారును శుక్రవారం రాత్రి మహీంద్రా గ్రూప్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో  ఆనంద్ మహీంద్రాతో పాటు మంత్రి కేటీఆర్, హీరో రాం చరణ్, టెక్ మహీంద్ర సీఎండీ, ఆటో అండ్ ఫాం సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజిరూకర్, కంపెనీ ఇతర సిబ్బంది హాజరయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement