లాహోర్: 2008 ముంబై ఉగ్రదాడులకు సంబంధించి 24 మంది భారతీయ సాక్షుల వాంగ్మూలాలను స్వీకరించేందుకు పాక్‌కు తీసుకురావాలని ఇక్కడి ఉగ్రవాద నిరోధక కోర్టు పాక్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఏ)ను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతినిధిని నియమించాలని ఎఫ్‌ఐఏ డైరెక్టర్ జనరల్(డీజీ)కు సూచించింది. విచారణను ముగించడానికి భారత సాక్షుల వాంగ్మూలం అవసరమని ప్రాసిక్యూషన్ వాదించడంతో ఉగ్రవాద నిరోధక కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కోర్టుకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఒకవేళ భారత సాక్షులు కోర్టుకు రాకుంటే వారి వాంగ్మూలం లేకుండానే తీర్పు ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరుతుంది’ అని తెలిపారు.