ఫూట్ పీలింగ్ ఛాలెంజ్ దృశ్యం
సోషల్ మీడియా మరో ప్రమాదకరమైన ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. టిక్‌టాక్‌లో ‘ఫుట్ పీలింగ్’ అనే కొత్త ఛాలెంజ్ మొదలైంది. ప్రపంచం నలుమూలల ఉన్న నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త ఛాలెంజ్‌పై మొగ్గుచూపుతున్నారు. వీడియోలు తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేస్తున్నారు. తమ కాళ్లకు ఫుట్ పీలింగ్ మాస్కును అంటించుకుని, అరికాళ్ల తోలును పీకేసుకుంటున్నారు. పని గట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ( ‘హమారీ పావ్‌రీ’ నయా ట్రెండ్ వైరల్ )
ఇంతకీ ఛాలెంజ్ ఏంటంటే?
ఫుట్ పీలింగ్ మాస్క్ జెల్‌ను రెండు అరికాళ్లకు పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత జెల్ అరికాళ్లకు గట్టిగా అతుక్కుపోయి పైన చర్మంలాగా ఏర్పడుతుంది. పైన చర్మంలాగా ఉన్న దాన్ని పీకేసుకోవాలి. అయితే ఈ ఛాలెంజ్ మనం అనుకున్నంత వీజీ ఏమీ కాదు! ఎక్కవ సేపు గనుక చర్మంపై దాన్ని ఉంచుకుంటే అలర్జీల బారిన పడి కాళ్లకు పుండ్లు లేచే అవకాశం ఉంది. జెల్ చర్మాన్ని గట్టిగా అతుక్కంటే కాలి చర్మం కూడా ఊడి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment