సాక్షి, చిత్తూరు: ఖండాంతరాల ప్రేమను పండించుకున్న అమెరికా అబ్బాయి, చిత్తూరు అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన పీటర్ గ్రెయినర్, షారౌన్‌ల కుమారుడు అండ్రూ గ్రెయినర్, చిత్తూరు కొంగారెడ్డిపల్లె ఉషానగర్ కాలనీకి చెందిన సుధాకర్, కుమారీల కుమార్తె శ్రీనిరీష హిందూ సంపద్రాయం ప్రకారం గురువారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు స్థానిక ఎంఎస్‌ఆర్ సర్కిల్ వద్దనున్న ఓ హోటల్ వేదికైంది.
శ్రీనిరీష 2013లో ఎంఎస్ చదువుకోవడానికి అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో చేరారు. ఆ సమయంలో సహ విద్యార్థి అండ్రూ గ్రెయినర్‌తో స్నేహం ఏర్పడింది. తదనంతరం అక్కడే ఇద్దరూ స్టాఫ్‌వేర్ ఉద్యోగాల్లో చేరారు. ఇరువురు ప్రేమించుకోవడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి ముహుర్తం కుదిరింది. ఇటీవల అమెరికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకొని, చిత్తూరులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment