Viral Video: పిల్లలను నేర్పాల్సింది విద్యాబుద్ధులు మాత్రమే కాదు.. సంఘంలో ఎలా మెలగాలన్నది కూడా!. సోషల్ మీడియాలో ఎరాలో పిల్లల్ని తప్పుదోవ పట్టించే రీతిలోనే ఉంటోంది చాలామంది తల్లిదండ్రుల పెంపకం. టెక్నాలజీ అవసరమే.. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది పిల్లలకు అలవాటు చేయాల్సింది పేరెంట్స్. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఏడో గ్రేడ్ చదివే ఓ చిన్నారి చేసిన పని.. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి.
మిచిగాన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు తిరిగి పడితే.. ఓ విద్యార్థి సకాలంలో స్పందించాడు. డ్రైవర్ సీటులోకి దూకి.. ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. ఆ ఘటన బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సాహసంగా ముందుకు దూకిన స్టూడెంట్‌ను దిల్లాన్ రీవ్స్‌గా గుర్తించిన అధికారులు అభినందించారు. బస్సును ఆపడమే కాదు.. ఎమర్జెన్సీ నెంబర్‌కు డయల్ చేయాలంటూ కేకలు వేశాడు ఆ స్టూడెంట్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment