బొద్దింక..ఇంకా..ఇంకా.. | Like a lot of roaches | Sakshi
Sakshi News home page

బొద్దింక..ఇంకా..ఇంకా..

Published Sat, Apr 25 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

బొద్దింక..ఇంకా..ఇంకా..

బొద్దింక..ఇంకా..ఇంకా..

కుక్కలను, పిల్లులను పెంచుకోవడం కామన్.. పావురాలు, చిలుకలను పెంచుకోవడమూ చూశాం.. ఆఖరికి కాకులను కూడా పెంచుకుంటారు.. కాని బొద్దింకలను... బొద్దింకలా కష్టమే అంటారు కదా..! కాని మిషిగాన్‌కు చెందిన కైల్ కేండిలియన్ మాత్రం ఎగిరి గంతేస్తాడు. ఎందుకంటే అతనికి బొద్దింకలంటే చాలా ఇష్టం మరి.. అందుకే వాటిని తన బెడ్‌రూమ్‌లో పెంచుకుంటున్నాడు.

ఏకంగా 130 జాతులకు చెందిన దాదాపు 2 లక్షల బొద్దింకలు తన గదిలో ఉన్నాయట.. వీటి కోసం ప్రత్యేకంగా అలమరాలు కూడా తయారుచేయించాడట.. అంతేకాదు వాటినిఅమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. ఎంత తెలివో ఆనందానికి ఆనందం.. పైగా డబ్బు బోనస్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement