యజమానిని రక్షించేందుకు..
షికాగో: విపత్కర సమయాల్లోనూ యజమాని పట్ల శునకాలు విశ్వాసాన్ని చాటుకుంటాయి! మిషిగాన్‌లోని పెటోస్కెయ్‌లో నివసించే బాబ్ అనే వ్యక్తి కొత్త ఏడాది రోజు కట్టెలు తెచ్చుకునేందుకు వ్యవసాయ క్షేత్రం నుంచి పెంపుడు కుక్క కెల్సీతో బయలుదేరాడు. కొద్దిదూరం నడిచాక కాలు జారి మంచులో పడి కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బాబ్‌ను గమనించిన కెల్సీ మొరగటం మొదలుపెట్టింది.
అయితే సమీపంలో ఎవరూ లేరు. దీంతో కెల్సీ.. బాబ్ శరీరంపైకి ఎక్కి చలి నుంచి రక్షణగా ఉండి తెల్లవారే వరకు అతను స్పృహ కోల్పోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరుసటి రోజు బాబ్ స్పృహ కోల్పోయినా.. కెల్సీ మాత్రం యాజమానిని కాపాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తర్వాత అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాబ్‌ను బయటికి తీసి రక్షించాడు.