పరుపులో నాలుగు అడుగుల పాము!
Published Wed, Jan 1 2014 1:05 PM | Last Updated on Fri, Aug 24 2018 5:25 PM
మీరు పడుకునే పరుపులో పాము దూరితే మీ పరిస్థితి ఏంటి ఓ సారి ఊహించుకోండి. బెడ్ రూమ్ లో చిన్న ఎలుక కనిపిస్తేనే అదిరిపోయే మనం.. ఏకంగా పరుపులో పాము కనిపిస్తే.. ఇంకా ఉహించడం కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలోని మిచిగాన్ లో గ్రాండ్ రాపిడ్స్ లో నివసించే హోలీ రైట్ బెడ్ రూమ్ లోని పరుపులో పాము దూరింది.
రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ బజార్ లో పరుపును తెచ్చుకుని వాడుకుంటోంది. అయితే సడన్ ఆ పరుపులో నాలుగు అడుగుల పాము కనిపించడంతో రైట్ కు చుక్కలు కనిపించాయి. వెంటనే తేరుకుని పరుపులో దూరిన పామును వీడియో చిత్రీకరించారు. పరుపులోకి పాము ఎలా దూరిందో అర్ధం కావడం లేదని రైట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
సెకండ్ హ్యండ్ పరుపును జాగ్రత్తగా క్లీన్ చేశాం. కుషన్స్ మార్చాం. అయితే అప్పుడు కనిపించని పాము అందులోకి ఎలా దూరిందో అర్ధం కావడం లేదు. పరుపులోని పామును జాగ్రత్తగా బాక్స్ లో బంధించి..పశువుల డాక్టర్ కు అప్పగించాలని అనుకున్నాం. అనుకోకుండా పాము చనిపోయింది అని రైట్ తెలిపింది.
Advertisement
Advertisement