couch
-
అంపైర్లను దూషించినందుకు...
దుబాయ్: భారత్‌తో ఆదివారం హైదరాబాద్‌లో ముగిసిన రెండో టెస్టు సందర్భంగా అంపైర్‌ను దూషించిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లాపై ఐసీసీ చర్య తీసుకుంది. భారత్‌తో జరిగే తొలి రెండు వన్డేలకు అతను దూరంగా ఉండాలంటూ నిషేధం విధించడంతో పాటు లా మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల లోపు వ్యవధిలో మళ్లీ తప్పిదానికి పాల్పడటంతో స్టువర్ట్ లాపై ఇలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది. రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మన్ కీరన్ పావెల్‌ను ఔట్‌గా ప్రకటించిన తర్వాత లా థర్డ్ అంపైర్ గదిలోకి దూసుకెళ్లి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం కొందరు ఆటగాళ్ల ముందే ఫోర్త్ అంపైర్‌పై కూడా అతను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో పావెల్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. అయితే ఆ క్యాచ్‌పై సందేహం ఉండటంతో అంపైర్ పలుమార్లు రీప్లేలు చూడాల్సి వచ్చింది. చివరకు ని -
పరుపులో నాలుగు అడుగుల పాము!
మీరు పడుకునే పరుపులో పాము దూరితే మీ పరిస్థితి ఏంటి ఓ సారి ఊహించుకోండి. బెడ్ రూమ్ లో చిన్న ఎలుక కనిపిస్తేనే అదిరిపోయే మనం.. ఏకంగా పరుపులో పాము కనిపిస్తే.. ఇంకా ఉహించడం కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలోని మిచిగాన్ లో గ్రాండ్ రాపిడ్స్ లో నివసించే హోలీ రైట్ బెడ్ రూమ్ లోని పరుపులో పాము దూరింది. రెండు నెలల క్రితం సెకండ్ హ్యాండ్ బజార్ లో పరుపును తెచ్చుకుని వాడుకుంటోంది. అయితే సడన్ ఆ పరుపులో నాలుగు అడుగుల పాము కనిపించడంతో రైట్ కు చుక్కలు కనిపించాయి. వెంటనే తేరుకుని పరుపులో దూరిన పామును వీడియో చిత్రీకరించారు. పరుపులోకి పాము ఎలా దూరిందో అర్ధం కావడం లేదని రైట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెకండ్ హ్యండ్ పరుపును జాగ్రత్తగా క్లీన్ చేశాం. కుషన్స్ మార్చాం. అయితే అప్పుడు కనిపించని పాము అందులోకి ఎలా దూరిందో అర్ధం కావడం లేదు. పరుపులోని పామును జాగ్రత్తగా బాక్స్ లో బంధించి..పశువుల డాక్టర్ కు అప్పగించాలని అనుకున్నాం. అనుకోకుండా పాము చనిపోయింది అని రైట్ తెలిపింది.