
దుబాయ్: భారత్‌తో ఆదివారం హైదరాబాద్‌లో ముగిసిన రెండో టెస్టు సందర్భంగా అంపైర్‌ను దూషించిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లాపై ఐసీసీ చర్య తీసుకుంది. భారత్‌తో జరిగే తొలి రెండు వన్డేలకు అతను దూరంగా ఉండాలంటూ నిషేధం విధించడంతో పాటు లా మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల లోపు వ్యవధిలో మళ్లీ తప్పిదానికి పాల్పడటంతో స్టువర్ట్ లాపై ఇలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది.
రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మన్ కీరన్ పావెల్‌ను ఔట్‌గా ప్రకటించిన తర్వాత లా థర్డ్ అంపైర్ గదిలోకి దూసుకెళ్లి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం కొందరు ఆటగాళ్ల ముందే ఫోర్త్ అంపైర్‌పై కూడా అతను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో పావెల్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. అయితే ఆ క్యాచ్‌పై సందేహం ఉండటంతో అంపైర్ పలుమార్లు రీప్లేలు చూడాల్సి వచ్చింది. చివరకు ని
Comments
Please login to add a commentAdd a comment