వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు శామ్యూల్స్‌పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో ఆరేళ్ల పాటు అతడు పాల్గోడదని ఐసీసీ సృష్టం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ గురువారం దృవీకరించారు.
"శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు, ఆ సమయంలో అతను అనేక అవినీతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అవినీతి నిరోధక కోడ్ ప్రకారం తన బాధ్యతలు ఎంటో అతడికి కచ్చితంగా తెలుసు.
అతడు ఇప్పుడు రిటైర్ అయినప్పటికీ.. ఈ నేరాలు జరిగినప్పుడు అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాబట్టి అతడిపై ఆరేళ్ల పాటు నిషేదం విధించడం జరిగింది. రూల్స్‌ను అతిక్రమించిన వారికి ఇదే సరైన శిక్ష" అని అలెక్స్ మార్షల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే?
కాగా 2019లో అబుదాబీ టీ10 లీగ్‌లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2021 సెప్టెంబర్‌లో ఐసీసీ మొత్తం నాలుగు అభియోగాలు మోపింది. ఈ లీగ్ సమయంలో అతడు బయట వ్యక్తుల నుంచి గిఫ్ట్‌లు తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. వీటిపై విచారణ జరిపిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు 2023 ఆగస్టులో శామ్యూల్స్‌ను దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ అతడిపై వేటు వేసింది. ఈ నిషేధం నవంబర్11 నుంచి అమల్లోకి రానుంది.
కాగా శామ్యూల్స్ వెస్టిండీస్ తరపున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 T20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు తన అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి 11,134 పరుగులతో పాటు 152 వికెట్లు పడగొట్టాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ సొంత చేసుకోవడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. . రెండు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ శామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: IND Vs AUS 1st T20: ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?
Comments
Please login to add a commentAdd a comment