Marlon Samuels
-
విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ..
వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు శామ్యూల్స్‌పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్లో ఆరేళ్ల పాటు అతడు పాల్గోడదని ఐసీసీ సృష్టం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ హెచ్ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ గురువారం దృవీకరించారు. "శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు, ఆ సమయంలో అతను అనేక అవినీతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అవినీతి నిరోధక కోడ్ ప్రకారం తన బాధ్యతలు ఎంటో అతడికి కచ్చితంగా తెలుసు. అతడు ఇప్పుడు రిటైర్ అయినప్పటికీ.. ఈ నేరాలు జరిగినప్పుడు అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాబట్టి అతడిపై ఆరేళ్ల పాటు నిషేదం విధించడం జరిగింది. రూల్స్‌ను అతిక్రమించిన వారికి ఇదే సరైన శిక్ష" అని అలెక్స్ మార్షల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏం జరిగిందంటే? కాగా 2019లో అబుదాబీ టీ10 లీగ్‌లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2021 సెప్టెంబర్‌లో ఐసీసీ మొత్తం నాలుగు అభియోగాలు మోపింది. ఈ లీగ్ సమయంలో అతడు బయట వ్యక్తుల నుంచి గిఫ్ట్‌లు తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. వీటిపై విచారణ జరిపిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు 2023 ఆగస్టులో శామ్యూల్స్‌ను దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ అతడిపై వేటు వేసింది. ఈ నిషేధం నవంబర్11 నుంచి అమల్లోకి రానుంది. కాగా శామ్యూల్స్ వెస్టిండీస్ తరపున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 T20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు తన అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులతో పాటు 152 వికెట్లు పడగొట్టాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ సొంత చేసుకోవడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. . రెండు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ శామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: IND Vs AUS 1st T20: ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..? -
ఆటకు శామ్యూల్స్ టాటా
కింగ్స్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల శామ్యూల్స్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్లో శామ్యూల్స్ చివరిసారి వెస్టిండీస్ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్లో అడుగుపెట్టిన శామ్యూల్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ప్రదర్శనతోనే విండీస్ రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు కూడా లభించాయి. శామ్యూల్స్ కెరీర్లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఓవరాల్‌గా తన కెరీర్లో శామ్యూల్స్ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు శామ్యూల్స్ గుడ్‌బై
జమైకా : విండీస్ సీనియర్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్‌ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శామ్యూల్స్ విండీస్ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు. 207 వన్డేలు, 71 టెస్టులు,67 టీ20లు ఆడిన శామ్యూల్స్ అన్ని ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.దీంతో పాటు అన్ని ఫార్మాట్లు కలిపి తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తోనూ 152 వికెట్లు తీశాడు. 2012, 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు. (చదవండి : శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్) 2016 వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో 85 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్‌తో టీ20 ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా శామ్యూల్స్ రికార్డు నెలకొల్పాడు. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌తో కలిసి శామ్యూల్స్ రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించడం ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది. కాగా 2018 డిసెంబర్ తర్వాత శామ్యూల్స్ విండీస్ తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. తన కెరీర్లో ఆటకంటే వివాదాలతోనే శామ్యూల్స్ ఎక్కువగా పేరు పొందాడు. ఈ మధ్యనే ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ భార్యపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి షేన్ వార్న్ ఆగ్రహానికి గురయ్యాడు. అంతకముందు కూడా 2012లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా వార్న్, శామ్యూల్స్ మధ్య పెద్ద గొడవే చోటుచేసుకుంది. -
శామ్యూల్స్‌కు మతి చెడింది : వార్న్
దుబాయ్ : ఆస్ట్రేలియా మాజీ బౌలర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వెస్టీండీస్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ పై ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. వార్న్ శామ్యూల్స్‌పై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే... ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 13వ సీజన్లో ఆడడానికి ముందు రెండు వారాలు క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. తన లైఫ్‌లో అత్యంత శత్రువుగా భావించే వ్యక్తితో కలిసి రెండు వారాలు క్వారంటైన్లో ఉండడలేని పరోక్షంగా శామ్యూల్స్ పేరును ప్రస్తావించాడు. దీనికి వార్నర్ స్పందిస్తూ 'నువ్వు చెప్పింది నిజం' అంటూ స్టోక్స్‌కు మద్దతు తెలిపాడు. అయితే శామ్యూల్స్ స్పందిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బెన్ స్టోక్స్, షేన్ వార్న్లనుద్దేశించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక తనకు ఉన్నతమైన స్కిన్ టోన్ ఉందంటూ జాత్యహంకార వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతోపాటు స్టోక్స్ భార్యపై కూడా అసభ్యకరవ్యాఖ్యలు చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది) దీనిపై తాజాగా వార్న్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడంతో పాటు కుటుంబసభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం. శామ్యూల్స్‌కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం... కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు.ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్.. అందుకే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు 'అంటూ చురకలంటించాడు. కాగా స్టోక్స్ ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. షేన్ వార్న్ అదే జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు కూడా స్టోక్స్, వార్న్‌లతో శామ్యూల్స్‌కు విభేదాలు ఉన్నాయి. అయితే తాజా గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనిపై శామ్యూల్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అంచనాలు అందుకోలేక చతికిలపడుతుంది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 7 ఓటములతో టేబుల్లో 7వ స్థానంలో ఉన్న రాజస్తాన్ ప్లేఆఫ్‌కు చేరడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. -
'స్టోక్స్.. నువ్వు బౌండరీ లైన్ వద్దే'
ఆంటిగ్వా: బెన్ స్టోక్స్, మార్లోన్ శామ్యూల్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకరు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ అయితే, మరొకరు వెస్టిండీస్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు. అయితే తమ మాటల ద్వారా ఒకరిపై ఒకరు విరుచుకుపడటంలో వారికి వారే సాటి. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్ సందర్బంగా శామ్యూల్స్ అవుటై పెవిలియన్ కు వెళ్తుండగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న స్టోక్స్ అతడ్ని కవ్వించాడు. ఇక వెళ్లి స్టేడియంలో కూర్చో అంటూ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. గతేడాది టీ 20 వరల్డ్ కప్ లోనూ వీరి మధ్య ఆసక్తికర వాగ్వాదం జరిగింది. ఇంగ్లండ్ జట్టుపై శామ్యూల్స్ చెలరేగిపోతున్న సమయంలో స్టోక్స్ మాటలకు పని చెప్పాడు. ఆ సమయంలో నీ పని నువ్వు చేసుకో అంటూ శామ్యూల్స్ కూడా దీటుగానే బదులిచ్చాడు. ఇదంతా గతమైనప్పటికీ, తాజాగా స్టోక్స్ పై శామ్యూల్స్ ముందుగానే విరుచుకుపడ్డాడు. ఈ నెల 11 నుంచి ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ జరగునున్న నేపథ్యంలో శామ్యూల్స్ తన నోటికి పని చెప్పాడు. 'నేను బ్యాటింగ్ చేస్తుంటే బెన్ స్టోక్స్ ను బౌండరీ లైన్ వద్దే ఫీల్డింగ్ చేస్తుండాలి. వీలైనంత ఎక్కువ సేపు అతడ్ని అక్కడ ఉంచేందుకు యత్నిస్తా. ఈ సిరీస్ లో అతడు సైలెంట్ గా ఉంటే ఓకే. నేను మంచి బాలుడిలా ఇంగ్లండ్ కు వెళుతున్నా. నన్ను స్టోక్స్ రెచ్చగొడితే మాత్రం అతనికి సరైన గుణపాఠం చెబుతా. గత కొన్ని రోజులగా స్టోక్స్ మారాడని అంటున్నారు. చూద్దాం.. ఏమి జరుగుతుందో'అని శామ్యూల్స్ పేర్కొన్నాడు. -
రెండేళ్ల తరువాత వన్డే జట్టులోకి..
ఆంటిగ్వా:సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు వెస్టిండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. ఇటీవల భారత్ తో్ జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ లో ఆడిన గేల్.. విండీస్ తరపున వన్డే ఆడి 29 నెలలు అయ్యింది. 2015 మార్చిలో గేల్ చివరిసారి వన్డే జట్టులో కనిపించాడు. ఆ తరువాత ఇంతకాలానికి గేల్ కు వన్డే జట్టులో స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా గేల్ కు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ ప్రకటించింది. గేల్ తో పాటు మార్లోన్ శామ్యూల్స్ కు విండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. 2016 అక్టోబర్ లో శామ్యూల్స్ చివరగా వన్డే ఆడాడు. ఈ ఇద్దరి ఎంపిక జట్టుకు అదనపు బలాన్ని తీసుకొస్తుందని క్రికెట్ వెస్టిండీస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్టనీ బ్రౌన్ అభిప్రాయపడ్డారు. దాంతోపాటు వీరి అనుభవం యువ క్రికెటర్లకు లాభిస్తుందని బ్రౌన్ పేర్కొన్నారు. అయితే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో కు చోటు కల్పించకపోవడానికి అతను పూర్తి ఫిట్ నెస్ తో లేకపోవడమేనని తెలిపారు. వచ్చే ఏడాది బ్రేవో పునరాగమనం చేసే అవకాశం ఉందన్నారు. గత కొంతకాలంగా విండీస్ క్రికెటర్లకు బోర్డుకు మధ్య కాంట్రాక్ట్ ఫీజుల విషయంలో తీవ్రస్థాయిలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో్నే కొంతమంది విండీస్ సినియర్ క్రికెటర్లు జట్టుకు దూరమవుతూ వచ్చారు. అయితే ఈ వివాదం కొంతవరకూ పరిష్కారం కావడంతో మళ్లీ వెటరన్ క్రికెటర్ల ఎంపికపై విండీస్ బోర్డు దృష్టి పెట్టింది. -
విండీస్ క్లీన్‌స్వీప్
అఫ్ఘాన్‌తో టి20 సిరీస్ బసెటెరె: మార్లన్ శామ్యూల్స్ తన టి20 కెరీర్లోనే అత్యధిక స్కోరు (66 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించడంతో అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మూడో టి20లోనూ విండీస్ విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నూర్ అలీ జర్దాన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించారు. కెస్రిక్ విలియమ్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లకు 147 పరుగులు చేసి నెగ్గింది. 82 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో శామ్యూల్స్ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. -
'నాకు పాక్ ఆర్మీలో జాయిన్ కావాలని ఉంది'
ఆంటిగ్వా: పాకిస్తాన్ లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సహకరించాలంటూ వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ విజ్ఞప్తి చేశాడు. సాధ్యమైనంత త్వరలో చర్యలు చేపట్టి ఆ దేశంలో క్రికెట్ క్రీడను బతికించాలని విన్నవించాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) టైటిల్ ను పెషావర్ జల్మీ గెలిచిన అనంతరం జీయో టీవీతో మాట్లాడిన శామ్యూల్స్.. ఆ దేశ క్రికెట్ కు స్సోర్ట్స్ గవర్నింగ్ బాడీ అండగా నిలవాలని కోరాడు. పాకిస్తాన్ లో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విదేశీ జట్లు అక్కడ మ్యాచ్ లు ఆడటానికి వెనుకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భద్రతాపరమైన ఇబ్బందులు ఉండటంతో ఏ జట్టు కూడా అక్కడ ఆడే సాహసం చేయడం లేదు. దీనిపై శామ్యూల్స్ తనదైన శైలిలో స్పందించాడు. 'అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు తిరిగి పాక్ కు రావాలి. అంతవరకూ అదే విషయాన్ని నేను ప్రమోట్ చేస్తూ ఉంటా. దాని కోసం ఏమైనా చేస్తా. నాకు పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం ఇవ్వండి. జమైకాలో నేను సైనికుణ్ని. పాక్ లో కూడా సైనికుడిగా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా. పాకిస్తాన్ కు సేవలందించడానికి ఆ దేశ ఆర్మీ సూట్ ను ఎందుకు ధరించకూడదు. పాక్ కు ఎప్పుడు నా అవసరం ఉన్నా సిద్ధంగా ఉంటా. పాక్ ఆర్మీ మెటాలిక్ బ్యాడ్జీని నా భుజాలపైకి వస్తే చచ్చేంత వరకూ సేవలందిస్తా. దాని కోసం ఎదురుచూస్తూ ఉంటా 'అని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో తో భేటీ సందర్బంగా శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు. -
శామ్యూల్స్ కు లైన్ క్లియర్!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వివాదాస్సద యాక్షన్ తో దాదాపు 13 నెలల పాటు బౌలింగ్ కు దూరంగా ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్ కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గత నెల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అతని బౌలింగ్ శైలిని పరీక్షించిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్యామ్యూల్స్ తాజా బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉన్నట్లు పేర్కొన్న ఐసీసీ.. ఇక నుంచి అతను తిరిగి అంతర్జాతీ మ్యాచ్ ల్లో బౌలింగ్ చేయవచ్చిన స్పష్టం చేసింది. 2015అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ అతను నిబంధనలకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసినట్టు ఫిర్యాదు అందగా విచారణలో తన మోచేయి 15 డిగ్రీల పరిమితికి మించి వంచుతున్నట్టుగా తేలింది. దాంతో అతనిపై 12 నెలల పాటు నిషేధం విధిస్తూ అదే ఏడాది డిసెంబర్ లో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అతని బౌలింగ్ శైలిపై తొలిసారి 2013లో వివాదం చెలరేగింది. ఆ తరువాత రెండేళ్లకు అతని బౌలింగ్ శైలిపై అనుమానాలు వచ్చాయి. దాంతో అతని బౌలింగ్ పై ఏడాది నిషేధం విధించారు. -
శామ్యూల్స్ డబుల్ ధమాకా
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించే అవార్డులలో శామ్యూల్స్ పంట పండింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సీనియర్ ప్లేయర్ మర్లోన్ శాయ్యూల్స్ సొంతం చేసుకున్నాడు. ఆంటిగ్వాలో విండీస్ బోర్డు అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విండీస్ గెలవడంతో కీలకపాత్ర పోషించడంతో పాటు గత ఏడాది కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న శామ్యూల్స్ కు అవార్డు ప్రకటించి గౌరవించాలని బోర్డు భావించింది. 2015లో 22 వన్డేలాడిన శామ్యూల్స్ 3 సెంచరీల సాయంతో 859 పరుగులు చేశాడు. టీ20 ఫైనల్లో ఛేజింగ్ లో బ్యాటింగ్ కు దిగిన ఈ ఆటగాడు కేవలం 66 బంతుల్లో 85 పరుగులు చేసి విండీస్ ను పొట్టి క్రికెట్లో మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. మహిళల విభాగంలో స్టెఫానీ టేలర్‌కు టీ20 ప్లేయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కైవసం చేసుకుంది. -
'హంతక ముఠాతో క్రికెటర్ కు సంబంధాలు'
ట్రినిడాడ్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ లాసన్ పై వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లొన్ శామ్యూల్స్ పరువునష్టం దావా వేశాడు. తన గురించి లాసన్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని శామ్యూల్స్ ఆరోపించాడు. జమైకాలోని హంతకుల ముఠాతో శామ్యూల్స్ కు సంబంధాలు ఉన్నాయని రేడియో కామెంటరీలో లాసన్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోజు అతడీ వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న 'బిగ్ స్పోర్ట్స్ బ్రేక్ ఫాస్ట్' రేడియో కార్యక్రమంలో లాసన్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్ లోని చీకటి వ్యక్తులతో శామ్యూల్స్ కు సంబంధాలున్నాయి. అతడి వెనుక ఎవరున్నారో మీకు తెలియదు. ప్రపంచంలోని హత్యల రాజధానిగా పేరు పొందిన వాటిలో ఒకటైన జమైకాలోని కింగ్ స్టన్ నుంచి అతడు వచ్చాడు. అక్కడి హంత ముఠాలతో అతడికి సంబంధాలున్నాయ'ని అన్నాడు. లాసన్ వ్యాఖ్యలు తనను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ శామ్యూల్స్ పరువునష్టం దావా వేశాడు. లాసన్ కామెంట్స్ న్యాయవిరుద్దంగా ఉండడమే కాకుండా, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. జర్నలిస్ట్ జేమ్స్ మాథహె పేరు కూడా దావాలో చేర్చాడు. -
శామ్యూల్స్ సెంచరీ వృధా
బ్రిడ్జిటౌన్: ముక్కోణపు సిరీస్ లో ఫైనల్లోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. 8వ వన్డేలో వెస్టిండీస్ ను 6 వికెట్లతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(78), మార్ష్(79) అర్ధసెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. 283 పరుగుల టార్గెట్ ను కంగారూ టీమ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మ్యాక్స్ వెల్ 46, బైయిలీ 34 పరుగులు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్ ను మార్లన్ శామ్యూల్స్, దినేశ్ రామదిన్ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 192 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. శామ్యూల్స్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. రామదిన్(91) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. మిగతా బ్యాట్ప్ మెన్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, ఫాల్కనర్ 2, బొలాండ్ 2 వికెట్లు పడగొట్టారు. సెంచరీ చేసిన శామ్యూల్స్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. -
ఆసీస్‌కు విండీస్ షాక్
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్: లక్ష్య ఛేదనలో మార్లన్ శామ్యూల్స్ (87 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో.... ముక్కోణపు సిరీస్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (123 బంతుల్లో 98; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (95 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిలీ (56 బంతుల్లో 55; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత విండీస్ 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 266 పరుగులు చేసింది. -
నాలుగేళ్ల తర్వాత గెలిచింది!
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): వన్డేల్లో నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని 45.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్లన్ శామ్యూల్స్(92, 87 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత పోరాటానికి తోడు చార్లెస్(48), బ్రావో(39) రాణించడంతో విండీస్ విజయాన్ని అందుకుంది. రామదిన్ 29, ఫ్లెచర్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్-నీల్, జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫాల్కనర్ ఒక వికెట్ తీశాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కంగారు టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా(98) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్ స్మిత్(74), బెయిలీ(55) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫించ్ డకౌటయ్యాడు. విండీస్ బౌలర్లలో హొల్డర్, బ్రాత్ వైట్, పొలార్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. శామ్యూల్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. -
మైక్‌తో కాదు బ్యాట్‌తో మాట్లాడుతా
కోల్‌కతా: కామెంటరీ బాక్స్‌లో తన గురించి విమర్శలు చేసిన ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌కు వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మార్లన్ శామ్యూల్స్ చురకలు అంటించాడు. తాను బ్యాట్‌తోనే సమాధానం చెబుతానని, మైక్‌తో కాదని అన్నాడు. ఆదివారం జరిగిన టి-20 ప్రపంచ కప్ ఫైనల్లో శామ్యూల్స్ 66 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. భారత్, వెస్టిండీస్‌ల మధ్య సెమీస్ మ్యాచ్ సందర్భంగా కామెంటరీ బాక్స్ నుంచి వార్న్.. శామ్యూల్స్‌పై కామెంట్స్ చేశాడు. 'నా గురించి షేన్ వార్న్ వరుసగా మాట్లాడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడినపుడు నాతో వార్న్‌కు ఇబ్బంది కలిగింది. ఏమిటన్నది నాకు తెలియదు. నేనెప్పుడూ అతన్ని గౌరవించలేదు. నా గురించి అతను మాట్లాడే పద్ధతి బాగాలేదు' అని శామ్యూల్స్ అన్నాడు. -
ధోనీ, సామ్యూల్స్.. ఇది సరికాదు గురూ!
కోల్‌కతా: ఆట అన్నాక కొన్నిసార్లు ఆనందం.. కొన్నిసార్లు నిర్వేదం సహజమే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఓ అంతర్జాతీయ ఆటగాడిగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత క్రికెటర్‌పై ఉంటుంది. వారి ప్రవర్తన హుందాగా ఉంటేనే ఈ జెంటల్మెన్ గేమ్‌కు వన్నె తెస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకుంటున్న యువతకు స్ఫూర్తిన్నిస్తుంది. కానీ టీ20 వరల్ కప్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ సామ్యూల్స్ మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు విమర్శలకు గురైంది. హుందాగా నడుచుకోవాల్సిన ఆటగాళ్లు అథమంగా ప్రవర్తించారనే విమర్శలు వినిపించాయి. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టుతో ధోనీ చాలా చిత్రంగా ప్రవర్తించాడు. తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన సామ్యూల్ ఫెర్రిస్తో 'వికెట్ కీపరైన కొడుకుగానీ, తమ్ముడుగానీ నీకు ఉన్నారా? నేను రిటైరవ్వడం వల్ల వారికేమైనా లబ్ధి చేకూరుతుందా' అంటూ ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న భారతీయ విలేకరి అడుగుతాడని తాను అనుకున్నట్టు చెప్పాడు. ఆ విలేకరిని తన పక్కన కూచొబెట్టుకొని ప్రశ్నలు అడిగాడు. ఇది ఒకరకంగా తనకు నచ్చిన ప్రశ్నలు అడిగినందుకు అసహనం చూపడమే. దీనిపై ఫెర్రిస్ స్పందిస్తూ తన సహచర భారతీయ జర్నలిస్టుల తరఫున ఈసారి తాను ధోనీ కోపాన్ని చవిచూసినట్టు చెప్పాడు. అతడి ధోరణిని తప్పుబట్టాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో 66 బంతుల్లో 85 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలుచుకున్న వెస్టిండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్ ఇంకా అహంభావాన్ని ప్రదర్శించాడు. విలేకరులతో మాట్లాడుతూ ఇటు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, అటు ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌పై విమర్శలు గుప్పించిన అతను.. మీడియా మైకులు పెట్టే బల్లపై కాలు మీద కాలు ఉంచి దర్జాగా తానే బాస్ అన్న రీతిలో మాట్లాడాడు. టీవీ మైకులకు అతని కాళ్లు తాకుతున్నా.. అదేమీ పట్టించుకోకుండా దర్జా ఒలుకబోశాడు. అతని ప్రవర్తన మీడియా మిత్రులకు కొద్దిగా ఇబ్బంది కల్పించాడు. సామ్యూల్స్ ధోరణి, ధోనీ అసంబద్ధమైన ప్రశ్నలు మీడియాను అగౌరవపరిచేవనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
శామ్యూల్స్ బౌలింగ్‌పై ఏడాది నిషేధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్ బౌలింగ్ శైలి రెండోసారి కూడా సందేహాస్పదంగా తేలింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అతడి బౌలింగ్‌పై ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డిసెంబర్ 2013లో తొలిసారిగా శామ్యూల్ బౌలింగ్‌పై వివాదం రేగింది. అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ అతను నిబంధనలకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసినట్టు ఫిర్యాదు అందగా విచారణలో తన మోచేయి 15 డిగ్రీల పరిమితికి మించి వంచుతున్నట్టుగా తేలింది. ఈ ఏడాది ఐసీసీ నిషేధం ఎదుర్కొన్న మూడో బౌలర్‌గా శామ్యూల్స్ నిలిచాడు. సునీల్ నరైన్ (వెస్టిండీస్), మొహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్)పై కూడా ఐసీసీ వేటు వేసింది. -
శామ్యూల్స్ బౌలింగ్ పై ఫిర్యాదు
కొలొంబో: వెస్టిండీస్ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్ బౌలింగ్ శైలి మరోసారి అనేక అనుమానాలకు తావిచ్చింది. గతవారం గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండటంతో మ్యాచ్ అధికారులు దృష్టి సారించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. దీంతో శ్యామ్యూల్స్ 14 రోజుల్లో తన బౌలింగ్ యాక్షన్ కు సంబంధించి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అప్పటివరకూ శామ్యూల్స్ జట్టులో కొనసాగుతాడు. అంటే రెండో టెస్టులో శామ్యూల్స్ ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా శామ్యూల్స్ తన బౌలింగ్ శైలిపై ఫిర్యాదులు ఎదుర్కొవడం మూడోసారి. ఇప్పటివరకూ 60 టెస్టు మ్యాచ్ లు ఆడిన శామ్యూల్స్ 41 వికెట్లు తీశాడు. 2008వ సంవత్సరంలో డర్బన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా అతని బౌలింగ్ పై తొలిసారి ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి. -
విండీస్ 186/4
ఆసీస్‌తో తొలి టెస్ట్ రోసీయూ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. మార్లన్ శామ్యూల్స్ (158 బంతుల్లో 71 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్), షేన్ డోవ్రిచ్ (185 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో మూడో రోజు శుక్రవారం కడపటి వార్తలందేసరికి విండీస్ 68 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. ప్రస్తుతం కరీబియన్ జట్టు 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అంతకుముందు ఆడమ్ వోజెస్ (247 బంతుల్లో 130 నాటౌట్; 13 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అద్భుత సెంచరీతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 107 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌట్ కావడంతో 170 పరుగుల ఆధిక్యం లభించింది. అరంగేట్రంలో శతకం చేసిన అత్యంత పెద్ద వయస్సు (35 ఏళ్ల 244 రోజులు) క్రికెటర్‌గా వోజెస్ రికార్డు సృష్టించాడు. -
మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ
ధర్మశాల: భారత్ తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఏడు ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. 112 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. వన్డేల్లో అతడికి ఇది ఏడో సెంచరీ. ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. కొచ్చిలో జరిగిన మొదటి వన్డేలోనూ శామ్యూల్స్ సెంచరీ(126) సాధించాడు. శామ్యూల్స్ అనూహ్య విజృంభణతో కొచ్చి వన్డేలో భారత్ ను విండీస్ 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది. -
విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం
వెస్టిండీస్ జట్టులోని కీలక ఆటగాళ్లు క్రిస్ గేల్, డారెన్ సామీ, మార్లన్ శామ్యూల్స్.. ఈ ముగ్గురికీ తమ జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది. విండీస్ తరఫున ఐర్లండ్ జట్టుతో వన్డేలతో పాటు టి-20 మ్యాచ్‌లు కూడా ఆడేందుకు వారిని పిలిచారు. న్యూజిలాండ్ పర్యటనలో మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన గేల్, మళ్లీ ఆడబోతున్నాడు. సామీ, సామ్యూల్స్ కూడా గాయాల బారిన పడి, మళ్లీ జాతీయ జట్టులోకి వస్తున్నారు. 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మిగెల్ కమిన్స్‌ను కూడా వన్డే జట్టులోకి తీసుకోగా, రవి రాంపాల్‌ను మాత్రం కేవలం టి-20లోకే తీసుకున్నారు. రాంపాల్ న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా బొటనవేలుకు గాయం కావడంతో సగంలోనే తిరిగొచ్చేశాడు. న్యూజిలాండ్ టూర్లో చెత్తగా ఆడిన టినో బెస్ట్, జాన్సన్ చార్లెస్, నర్సింగ్ దేవ్ నరైన్, చాద్విక్ వాల్టన్లను జట్టు నుంచి తప్పించారు. ఆల్‌రౌండర్ పొలార్డ్‌కు మోకాలి గాయం కావడంతో అతడినీ తీసుకోలేదు. క్రిష్‌మర్ సంటోకీ, డ్వేన్ స్మిత్ ఇద్దరినీ టి20 జట్టులోకి తీసుకున్నారు.