శామ్యూల్స్ సెంచరీ వృధా | Smith, Marsh lead Australia into final | Sakshi
Sakshi News home page

శామ్యూల్స్ సెంచరీ వృధా

Published Wed, Jun 22 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

శామ్యూల్స్ సెంచరీ వృధా

శామ్యూల్స్ సెంచరీ వృధా

బ్రిడ్జిటౌన్: ముక్కోణపు సిరీస్ లో ఫైనల్లోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. 8వ వన్డేలో వెస్టిండీస్ ను 6 వికెట్లతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(78), మార్ష్(79) అర్ధసెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. 283 పరుగుల టార్గెట్ ను కంగారూ టీమ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. మ్యాక్స్ వెల్ 46, బైయిలీ 34 పరుగులు చేశారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్ ను మార్లన్ శామ్యూల్స్, దినేశ్ రామదిన్ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 192 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. శామ్యూల్స్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. రామదిన్(91) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. మిగతా బ్యాట్ప్ మెన్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, ఫాల్కనర్ 2, బొలాండ్ 2 వికెట్లు పడగొట్టారు. సెంచరీ చేసిన శామ్యూల్స్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement