'స్టోక్స్.. నువ్వు బౌండరీ లైన్ వద్దే' | Marlon Samuels tells Ben Stokes to 'stay on the boundary' | Sakshi
Sakshi News home page

'స్టోక్స్.. నువ్వు బౌండరీ లైన్ వద్దే'

Published Tue, Sep 5 2017 12:21 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

'స్టోక్స్.. నువ్వు బౌండరీ లైన్ వద్దే'

'స్టోక్స్.. నువ్వు బౌండరీ లైన్ వద్దే'

ఆంటిగ్వా: బెన్ స్టోక్స్, మార్లోన్ శామ్యూల్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకరు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ అయితే, మరొకరు వెస్టిండీస్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు. అయితే తమ మాటల ద్వారా ఒకరిపై ఒకరు విరుచుకుపడటంలో వారికి వారే సాటి. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్ సందర్బంగా శామ్యూల్స్ అవుటై పెవిలియన్ కు వెళ్తుండగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న స్టోక్స్ అతడ్ని కవ్వించాడు.  ఇక వెళ్లి స్టేడియంలో కూర్చో అంటూ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. గతేడాది టీ 20 వరల్డ్ కప్ లోనూ వీరి మధ్య ఆసక్తికర వాగ్వాదం జరిగింది. ఇంగ్లండ్ జట్టుపై శామ్యూల్స్ చెలరేగిపోతున్న సమయంలో స్టోక్స్ మాటలకు పని చెప్పాడు.

 

ఆ సమయంలో నీ పని నువ్వు చేసుకో అంటూ శామ్యూల్స్ కూడా దీటుగానే బదులిచ్చాడు. ఇదంతా గతమైనప్పటికీ, తాజాగా స్టోక్స్ పై శామ్యూల్స్ ముందుగానే విరుచుకుపడ్డాడు.  ఈ నెల 11 నుంచి ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ జరగునున్న నేపథ్యంలో శామ్యూల్స్ తన నోటికి పని చెప్పాడు. 'నేను బ్యాటింగ్ చేస్తుంటే బెన్ స్టోక్స్ ను బౌండరీ లైన్ వద్దే ఫీల్డింగ్ చేస్తుండాలి. వీలైనంత ఎక్కువ సేపు అతడ్ని అక్కడ ఉంచేందుకు యత్నిస్తా. ఈ సిరీస్ లో అతడు సైలెంట్ గా ఉంటే ఓకే. నేను మంచి బాలుడిలా ఇంగ్లండ్ కు వెళుతున్నా. నన్ను స్టోక్స్ రెచ్చగొడితే మాత్రం అతనికి సరైన గుణపాఠం చెబుతా. గత కొన్ని రోజులగా స్టోక్స్ మారాడని అంటున్నారు. చూద్దాం.. ఏమి జరుగుతుందో'అని శామ్యూల్స్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement