శామ్యూల్స్ కు లైన్ క్లియర్! | West Indies all-rounder Marlon Samuels cleared to bowl in international cricket | Sakshi
Sakshi News home page

శామ్యూల్స్ కు లైన్ క్లియర్!

Published Fri, Feb 17 2017 1:22 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

శామ్యూల్స్ కు లైన్ క్లియర్!

శామ్యూల్స్ కు లైన్ క్లియర్!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వివాదాస్సద యాక్షన్ తో దాదాపు 13 నెలల పాటు బౌలింగ్ కు దూరంగా ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్  కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గత నెల్లో  అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అతని బౌలింగ్ శైలిని పరీక్షించిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్యామ్యూల్స్ తాజా బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడే ఉన్నట్లు పేర్కొన్న ఐసీసీ.. ఇక నుంచి అతను తిరిగి అంతర్జాతీ మ్యాచ్ ల్లో బౌలింగ్ చేయవచ్చిన స్పష్టం చేసింది.

2015అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ అతను నిబంధనలకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసినట్టు ఫిర్యాదు అందగా విచారణలో తన మోచేయి 15 డిగ్రీల పరిమితికి మించి వంచుతున్నట్టుగా తేలింది. దాంతో అతనిపై 12 నెలల పాటు నిషేధం విధిస్తూ అదే ఏడాది డిసెంబర్ లో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అతని బౌలింగ్ శైలిపై తొలిసారి 2013లో వివాదం చెలరేగింది. ఆ తరువాత రెండేళ్లకు అతని బౌలింగ్ శైలిపై అనుమానాలు వచ్చాయి. దాంతో అతని బౌలింగ్ పై ఏడాది నిషేధం విధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement