విండీస్ క్లీన్‌స్వీప్
అఫ్ఘాన్‌తో టి20 సిరీస్
బసెటెరె: మార్లన్ శామ్యూల్స్ తన టి20 కెరీర్‌లోనే అత్యధిక స్కోరు (66 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించడంతో అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మూడో టి20లోనూ విండీస్ విజయం సాధించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది.
మొహమ్మద్ నబీ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నూర్ అలీ జర్దాన్ (19 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించారు. కెస్రిక్ విలియమ్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లకు 147 పరుగులు చేసి నెగ్గింది. 82 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో శామ్యూల్స్ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి.