ఆసీస్‌తో తొలి టెస్ట్
రోసీయూ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. మార్లన్ శామ్యూల్స్ (158 బంతుల్లో 71 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్), షేన్ డోవ్‌రిచ్ (185 బంతుల్లో 70; 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో మూడో రోజు శుక్రవారం కడపటి వార్తలందేసరికి విండీస్ 68 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. ప్రస్తుతం కరీబియన్ జట్టు 16 పరుగుల ఆధిక్యంలో ఉంది.
37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అంతకుముందు ఆడమ్ వోజెస్ (247 బంతుల్లో 130 నాటౌట్; 13 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అద్భుత సెంచరీతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 107 ఓవర్లలో 318 పరుగులకు ఆలౌట్ కావడంతో 170 పరుగుల ఆధిక్యం లభించింది. అరంగేట్రంలో శతకం చేసిన అత్యంత పెద్ద వయస్సు (35 ఏళ్ల 244 రోజులు) క్రికెటర్‌గా వోజెస్ రికార్డు సృష్టించాడు.
విండీస్ 186/4
Published Sat, Jun 6 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM
Advertisement
Advertisement