శామ్యూల్స్ బౌలింగ్‌పై ఏడాది నిషేధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లన్ శామ్యూల్స్ బౌలింగ్ శైలి రెండోసారి కూడా సందేహాస్పదంగా తేలింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి బౌలింగ్‌పై ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డిసెంబర్ 2013లో తొలిసారిగా శామ్యూల్ బౌలింగ్‌పై వివాదం రేగింది.
అక్టోబర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ అతను నిబంధనలకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసినట్టు ఫిర్యాదు అందగా విచారణలో తన మోచేయి 15 డిగ్రీల పరిమితికి మించి వంచుతున్నట్టుగా తేలింది. ఈ ఏడాది ఐసీసీ నిషేధం ఎదుర్కొన్న మూడో బౌలర్‌గా శామ్యూల్స్ నిలిచాడు. సునీల్ నరైన్ (వెస్టిండీస్), మొహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్)పై కూడా ఐసీసీ వేటు వేసింది.