
మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ
ధర్మశాల: భారత్ తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఏడు ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. 112 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. వన్డేల్లో అతడికి ఇది ఏడో సెంచరీ. ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
కొచ్చిలో జరిగిన మొదటి వన్డేలోనూ శామ్యూల్స్ సెంచరీ(126) సాధించాడు. శామ్యూల్స్ అనూహ్య విజృంభణతో కొచ్చి వన్డేలో భారత్ ను విండీస్ 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది.