విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం | chris gayle included in west indies squad to play Ireland | Sakshi
Sakshi News home page

విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం

Published Fri, Feb 14 2014 2:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం

విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం

వెస్టిండీస్ జట్టులోని కీలక ఆటగాళ్లు క్రిస్ గేల్, డారెన్ సామీ, మార్లన్ శామ్యూల్స్.. ఈ ముగ్గురికీ తమ జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది. విండీస్ తరఫున ఐర్లండ్ జట్టుతో వన్డేలతో పాటు టి-20 మ్యాచ్లు కూడా ఆడేందుకు వారిని పిలిచారు. న్యూజిలాండ్ పర్యటనలో మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన గేల్, మళ్లీ ఆడబోతున్నాడు. సామీ, సామ్యూల్స్ కూడా గాయాల బారిన పడి, మళ్లీ జాతీయ జట్టులోకి వస్తున్నారు.

23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మిగెల్ కమిన్స్ను కూడా వన్డే జట్టులోకి తీసుకోగా, రవి రాంపాల్ను మాత్రం కేవలం టి-20లోకే తీసుకున్నారు. రాంపాల్ న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా బొటనవేలుకు గాయం కావడంతో సగంలోనే తిరిగొచ్చేశాడు. న్యూజిలాండ్ టూర్లో చెత్తగా ఆడిన టినో బెస్ట్, జాన్సన్ చార్లెస్, నర్సింగ్ దేవ్ నరైన్, చాద్విక్ వాల్టన్లను జట్టు నుంచి తప్పించారు. ఆల్రౌండర్ పొలార్డ్కు మోకాలి గాయం కావడంతో అతడినీ తీసుకోలేదు. క్రిష్మర్ సంటోకీ, డ్వేన్ స్మిత్ ఇద్దరినీ టి20 జట్టులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement