West Indies Team
-
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
నరేంద్రజాలం
1988... మద్రాసు నగరం ‘పొంగల్’ వేడుకలకు సిద్ధమవుతోంది. మరో వైపు చెపాక్ మైదానంలో వెస్టిండీస్‌తో భారత జట్టు టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది. గత తొమ్మిదేళ్లలో భారత గడ్డపై ఆడిన 16 టెస్టుల్లో 6 గెలిచి 10 డ్రా చేసుకొని ఓటమన్నదే ఎరుగని విండీస్ అప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. దాంతో భారత్ గెలుపు గురించి కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అరుదైన మ్యాచ్‌కు తాము సాక్షులం కాబోతున్నామనే విషయం చెన్నపట్నం అభిమానులకు అప్పుడు తెలీదు. ఒకే ఒక ఆటగాడు తన సంచలన ప్రదర్శనతో దీనిని చేసి చూపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 16 వికెట్లు తీసి 19 ఏళ్ల నరేంద్ర దీప్‌చంద్ హిర్వాణి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. సిరీస్‌లో అప్పటికే వెనుకబడింది భారత్. దీంతో కచ్చితంగా నాలుగో టెస్టు గెలవాలి. ఇలాంటి విపత్కర సమయంలోనే నరేంద్ర హిర్వాణితో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు డబ్ల్యూవీ రామన్, అజయ్ శర్మ కూడా అరంగేట్రం చేశారు. కళ్ల జోడు, హెడ్ బ్యాండ్, రిస్ట్ బ్యాండ్, మీసాలతో మధ్యప్రదేశ్‌కు చెందిన హిర్వాణి అందరికీ కొత్తగా కనిపించాడు. టెస్టుల్లో లెగ్‌స్పిన్ బౌలింగ్‌పై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కొన్నేళ్ల క్రితం లక్ష్మణ్ శివరామకృష్ణన్ వన్డేల్లో ప్రభావం చూపించినా... టెస్టుల్లో పేలవంగా బౌలింగ్ చేయడంతో మణికట్టు స్పిన్నర్‌పై అన్నీ సందేహాలే. ఇలాంటి స్థితిలో హిర్వాణికి ‘టెస్టు’ మొదలైంది. రవిశాస్త్రి కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఏకైక టెస్టును నరేంద్ర తన పేరిట లిఖించుకున్నాడు. టపటపా... షేన్‌వార్న్, అనిల్ కుంబ్లేలు లెగ్‌స్పిన్‌కు ప్రాచుర్యం కల్పించక ముందు మణికట్టు మాయాజాలం ఏమిటో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లోనే చూశారు. లెగ్‌బ్రేక్‌లు, గూగ్లీలు, ఫ్లిప్పర్లు... ఇలా అన్ని ఆయుధాలతో హిర్వాణి వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రెండు వికెట్లు కపిల్, రవిశాస్త్రి తీయగా...తర్వాతి 8 హిర్వాణి ఖాతాలో చేరాయి. రెండో ఇన్నింగ్స్‌లో వ్యూహం మార్చిన కరీబియన్లు ముందుకొచ్చి షాట్లు ఆడుతూ హిర్వాణి లయ దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. కానీ అద్భుతమైన టర్న్‌తో అతను ప్రత్యర్థి పని పట్టాడు. ఫలితం మరో 8 వికెట్లు. ఇందులో నాలుగు స్టంపౌట్లు ఉన్నాయి. అర్షద్ అయూబ్, రామన్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 136 పరుగులిచ్చి 16 వికెట్లు తీసిన హిర్వాణి అప్పటి వరకు బాబ్ మాసీ (ఆసీస్) పేరిట ఉన్న 16/137 రికార్డును బద్దలు కొట్టాడు. 32 ఏళ్లు దాటినా హిర్వాణి తొలి టెస్టు ఘనత మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. అతని జోరుతో భారత్ ఈ మ్యాచ్‌ను 255 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. చెప్పి మరీ...చేజిక్కించుకున్నాడు ఎందరినీ అవుట్ చేసినా కింగ్ వివియన్ రిచర్డ్స్ వికెట్ ఇచ్చే కిక్కే వేరు. ఈ విషయం హిర్వాణికి కూడా తెలుసు. రెండో రోజు ఆట ముగిసే సరికి రిచర్డ్స్ 62 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అప్పటి నిబంధనల ప్రకారం మూడో రోజు విశ్రాంతి దినం. రిచర్డ్స్‌ను తాను ఎలాగైనా అవుట్ చేస్తానంటూ హిర్వాణి రోజంతా సహచరులతో చెబుతూనే వచ్చాడు. నాలుగో రోజు ఆరంభంలోనే అతను వేసిన అద్భుతమైన ఫ్లిప్పర్ రిచర్డ్స్ స్టంప్స్‌ను ఎగరగొట్టింది. అలా ముగిసిపోయింది... మెరుపులా దూసుకొచ్చిన హిర్వాణి కెరీర్ అంతే వేగంగా ముగిసిపోయింది. 16 వికెట్ల టెస్టు తర్వాత అతను మరో 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. మద్రాసు టెస్టు తర్వాత స్వదేశంలోనే జరిగిన తర్వాతి 3 టెస్టుల్లో కలిపి అతను 20 వికెట్లతో చెలరేగాడు. అయితే ఆ తర్వాత విదేశాల్లో అతని బౌలింగ్ మ్యాజిక్ పని చేయలేదు. 1989లో విండీస్ గడ్డపై జరిగిన సిరీస్‌లో వారు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఆడటంతో 3 టెస్టుల్లో 6 వికెట్లే దక్కాయి. 1990లో ఇంగ్లండ్ సిరీస్‌తో కుంబ్లే అడుగు పెట్టిన తర్వాత హిర్వాణికి దాదాపుగా దారులు మూసుకుపోయాయి. ఐదేళ్ల విరామం తర్వాత అనూహ్యంగా మళ్లీ టెస్టు అవకాశం దక్కినా లాభం లేకపోయింది. చివరకు 17 టెస్టుల్లో 30.10 సగటు, 66 వికెట్లతో హిర్వాణి కెరీర్ ముగిసింది. అతని కుమారుడు మిహిర్ హిర్వాణి కూడా తండ్రి బాటలోనే లెగ్‌స్పిన్నర్‌గా ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇంకా ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయిన మిహిర్ 27 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 34.37 సగటుతో 70 వికెట్లు తీశాడు. తనయుడు మిహిర్‌తో -
రామ్‌దిన్‌కు ఉద్వాసన
భారత్‌తో సిరీస్‌కు విండీస్ జట్టు ప్రకటన బస్సెటెర్రో: భారత్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు సీనియర్ వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో జాతీయ జట్టుకు తొలిసారిగా రోస్టన్ చేస్ ఎంపికయ్యాడు. రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేస్ భారత్‌తో ఆడినా కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతడి ఫస్ట్ క్లాస్ సగటు 42.87 కావడంతో ఎంపిక చేశారు. 11 ఏళ్లుగా జట్టుకు ఆడుతున్న రామ్‌దిన్ గతవారమే తన ఉద్వాసన గురించి విండీస్ బోర్డుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. పేసర్ కీమర్ రోచ్‌కు చోటు దక్కలేదు. షానన్ గాబ్రియల్ ఒక్కడే జట్టులో స్పెషలిస్ట్ పేసర్. ఈనెల 21 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. జట్టు: హోల్డర్ (కెప్టెన్), బ్రాత్‌వైట్, బిషూ, బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, రాజేంద్ర చంద్రిక, చేస్, డోరిచ్, గాబ్రియల్, జాన్సన్, శామ్యూల్స్. -
విండీస్ కెప్టెన్ స్యామీకి అరుదైన గౌరవం
వెస్టిండీస్ జట్టుకు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించినందుకు ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీకి అరుదైన గౌరవం లభించింది. అతడి సొంత దేశం సెయింట్ లూసియాలోని ప్రధాన క్రికెట్ స్టేడియానికి ఈ స్టార్ క్రికెటర్ పేరు పెట్టారు. ‘బ్యూసెజర్ క్రికెట్ మైదానాన్ని ఇకపై డారెన్ స్యామీ జాతీయ క్రికెట్ మైదానంగా పేరు మారుస్తున్నాం’ అని ఆ దేశ ప్రధాని కెన్ని. డి. ఆంథోని ప్రకటించారు. -
వెస్టిండీస్ రాత మారేనా!
నేటినుంచి ఆస్ట్రేలియాతో చివరి టెస్టు సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరమైన ఆటతీరు కనబరుస్తున్న వెస్టిండీస్ జట్టుకు కాస్తయినా పరువు నిలబెట్టుకునేందుకు చివరి అవకాశం మిగిలింది. ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఆదివారం నుంచి సిడ్నీలో జరుగుతుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి ఇప్పటికే ఫ్రాంక్‌వరెల్ ట్రోఫీని నిలబెట్టుకున్న స్మిత్ సేన 3-0పై గురి పెట్టింది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఆసీస్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. నాథన్ లయోన్‌తో పాటు స్టీవ్ ఓ కీఫ్ జట్టులోకి ఎంపికయ్యాడు. గత రెండు టెస్టుల్లో విండీస్ తరఫున డారెన్ బ్రేవో మినహా మిగతా ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. గత టెస్టు చివర్లో కొంత పోరాట పటిమ కనబర్చిన ఆ జట్టు బ్యాటింగ్‌కు అనుకూలించే సిడ్నీ మైదానంలో ఏ మాత్రం మెరుగు పడుతుందో చూడాలి. కీమర్ రోచ్ స్థానంలో యువ పేసర్ మిగల్ కమిన్స్‌కు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కవచ్చు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, నిధుల సేకరణలో భాగంగా ఈ టెస్టు మ్యాచ్ మొత్తం గులాబీ రంగుమయం కానుంది. మ్యాచ్ ద్వారా దాదాపు 3 లక్షల 80 వేల డాలర్లు (దాదాపు రూ. 2.5 కోట్లు) సేకరించి మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. ఉదయం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
చందర్‌పాల్‌కు మొండి చెయ్యి
రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో బ్రియాన్ లారా (11,953 పరుగులు) తర్వాత చందర్‌పాల్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో 87 పరుగులు చేస్తే చందర్‌పాల్ టాప్ స్కోరర్ ఘనతను సాధిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చందర్‌పాల్ సగటు 15.33 మాత్రమే ఉండటంతో సెలక్టర్లు అతని ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఆసీస్‌తో ఒక్క సిరీస్‌కు అవకాశం ఇస్తే బాగుండేదని చందర్‌పాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. 1994లో జాతీయ జట్టులోకి వచ్చిన చందర్‌పాల్ ఇప్పటివరకు 164 టెస్టులు ఆడి 51.37 సగటుతో 11,867 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సెలక్టర్ల తాజా నిర్ణయంతో చందర్‌పాల్ టెస్టు కెరీర్ ముగిసినట్టేనని భావించాలి. -
విండీస్ లక్ష్యం 192
బ్రిడ్జిటౌన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు విజయం వైపు పయనిస్తోంది. కుక్ సేన విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ మూడో రోజు ఆదివారం కడపటి వార్తలందేసరికి 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో బ్రేవో (15), శామ్యూల్స్ (12) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 42.1 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. టేలర్, హోల్డర్, పెరుమాళ్ మూడేసి వికెట్లు తీశారు. -
భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం
కోచి: నెహ్రూ స్టేడియంలో భారత్‌కు వెస్టిండీస్‌కు మధ్య బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ 124 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో వెస్టిండీస్ అధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన వెస్టిండీస్ ఆటగాడు శ్యామూల్స్ 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో శ్యామూల్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వెస్టిండీస్ మిగతా ఆటగాళ్లు రామ్‌దిన్ (61), స్మిత్ (46), డీఎమ్ బ్రేవో (28) పరుగులకే పెవీలియన్ చేరగా, సమ్మీ (10) నాటౌట్‌గా నిలిచాడు. కాగా, పొలార్డ్, రసెల్ సింగల్ డిజిట్‌కే పరిమితమైయ్యారు. భారత్ బౌలర్లలో మహ్మద్ సమీ 4 వికెట్లు తీయగా, జడేజా, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు. వెస్టిండీస్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్ శతవిధాలా శ్రమించింది. కానీ వెస్టిండీస్ బౌలర్ల విసిరే బంతుల మాయాజాలానికి ధోనీసేన ఉక్కిరిబిక్కిరైంది. భారత్ ఆటగాడు ధావన్ 68 పరుగులు చేయడం భారత్‌కు కొంత ఊరట కలిగించన మిగతా ఆటగాళ్లు పేలవంగా ఆడటంతో 197 పరుగులకే భారత్ ఆలౌటై ఓటమిపాలైంది. భారత్ ఆటగాళ్లు రహెనె 24, ధోనీ 8 పరుగులు చేయగా, జడేజా 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో రాంపాల్, బ్రేవో, శ్యాముల్స్ తలో రెండు వికెట్లు తీయగా, టైలర్, రసెల్, సమిలు తలో ఒక వికెట్ తీశారు. -
విండీస్ ‘గంగ్నమ్’
ఆస్ట్రేలియాపై అద్భుత విజయం స్యామీ సంచలన హిట్టింగ్ మెరిసిన క్రిస్ గేల్ వెస్టిండీస్ జట్టు టి20 ప్రపంచకప్ గెలిచినా ఇంత సంబరపడదేమో. మ్యాచ్‌కు ముందు రోజు ఆస్ట్రేలియా ఆటగాడు ఫాల్క్‌నర్ ‘మాకు వ్యక్తిగతంగా వెస్టిండీస్ క్రికెటర్లంటే ఇష్టం లేదు’ అని చేసిన వ్యాఖ్య కరీబియన్లలో కసి పెంచింది. మైదానంలోనే దీనికి సమాధానం చెబుతానన్న వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ.... ఫాల్క్‌నర్ బౌలింగ్‌లోనే రెండు సిక్సర్లు బాది విండీస్‌ను గెలిపించాడు. ఫలితం... గేల్ గంగ్నమ్ డ్యాన్స్ చేశాడు. కరీబియన్లు చిందేశారు. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి మాటల యుద్ధంతో ప్రత్యర్థులను సగం ఓడించే ఆస్ట్రేలియన్లకు పెద్ద షాక్ తగిలింది. పెద్ద హిట్టర్లున్న జట్టును రెచ్చగొడితే ఫలితం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండు ఓవర్లలో విజయానికి 31 పరుగులు అవసరమైన దశలో... విండీస్ కెప్టెన్ స్యామీ (13 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కేవలం పది బంతుల వ్యవధిలోనే 31 పరుగులు బాది జట్టును గెలిపించాడు. టి20ల్లో వెస్టిండీస్కిదే అత్యుత్తమ ఛేజింగ్ కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్సర్), వార్నర్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) వేగంగా ఆడినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హాడ్జ్ (26 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో కుదురుకుంది. చివర్లో హాడిన్ (7 బంతుల్లో 15 నాటౌట్) ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో బద్రీ, శామ్యూల్స్, నరైన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. వెస్టిండీస్ జట్టు 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. టోర్నీలో క్రిస్ గేల్ (35 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలిసారి తన శైలిలో వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. స్మిత్ (17), సిమ్మన్స్ (26) కూడా రాణించడంతో వెస్టిండీస్ 12 ఓవర్లలో 100 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత పరుగుల వేగం నెమ్మదించడంతో చివరి నాలుగు ఓవర్లలో విండీస్ విజయానికి 53 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో డ్వేన్ బ్రేవో (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), స్యామీ చెలరేగారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 19 బంతుల్లోనే 49 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్యామీకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ ఓట మితో ఆసీస్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 178/8 (20 ఓవర్లలో) (మ్యాక్స్‌వెల్ 45; బద్రీ 2/37, శామ్యూల్స్ 2/20, నరైన్ 2/19) వెస్టిండీస్ ఇన్నింగ్స్: 179/4 (19.4 ఓవర్లలో) (గ్రేల్ 53; బ్రేవో నాటౌట్ 27; స్యామీ నాటౌట్ 34; స్టార్క్ 2/50). టి20 ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ x నెదర్లాండ్స్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి ఇంగ్లండ్ x దక్షిణాఫ్రికా రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం
వెస్టిండీస్ జట్టులోని కీలక ఆటగాళ్లు క్రిస్ గేల్, డారెన్ సామీ, మార్లన్ శామ్యూల్స్.. ఈ ముగ్గురికీ తమ జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది. విండీస్ తరఫున ఐర్లండ్ జట్టుతో వన్డేలతో పాటు టి-20 మ్యాచ్‌లు కూడా ఆడేందుకు వారిని పిలిచారు. న్యూజిలాండ్ పర్యటనలో మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన గేల్, మళ్లీ ఆడబోతున్నాడు. సామీ, సామ్యూల్స్ కూడా గాయాల బారిన పడి, మళ్లీ జాతీయ జట్టులోకి వస్తున్నారు. 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మిగెల్ కమిన్స్‌ను కూడా వన్డే జట్టులోకి తీసుకోగా, రవి రాంపాల్‌ను మాత్రం కేవలం టి-20లోకే తీసుకున్నారు. రాంపాల్ న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా బొటనవేలుకు గాయం కావడంతో సగంలోనే తిరిగొచ్చేశాడు. న్యూజిలాండ్ టూర్లో చెత్తగా ఆడిన టినో బెస్ట్, జాన్సన్ చార్లెస్, నర్సింగ్ దేవ్ నరైన్, చాద్విక్ వాల్టన్లను జట్టు నుంచి తప్పించారు. ఆల్‌రౌండర్ పొలార్డ్‌కు మోకాలి గాయం కావడంతో అతడినీ తీసుకోలేదు. క్రిష్‌మర్ సంటోకీ, డ్వేన్ స్మిత్ ఇద్దరినీ టి20 జట్టులోకి తీసుకున్నారు. -
వన్డేల్లోనైనా నిలబడతారా..!
ఒక వైపు భీకర ఫామ్‌లో భారత జట్టు...350కు పైగా పరుగుల విజయలక్ష్యాన్ని కూడా సునాయాసంగా అందుకుంటూ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. మరో వైపు చేవ లేకుండా చేతులెత్తేస్తున్న వెస్టిండీస్ జట్టు...ఒక్క టెస్టు ఇన్నింగ్స్‌లోనూ కనీసం వంద ఓవర్లు ఆడలేని బ్యాట్స్‌మెన్, పేలవ బౌలింగ్‌తో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇలాంటి అంతరాల మధ్య ఇరు జట్లు వన్డే సిరీస్‌లో పోటీ పడనున్నాయి. టెస్టు జట్టుతో పోలిస్తే వన్డే టీమ్‌లో జరిగిన మార్పులు విండీస్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి. కొచ్చి: యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను ముగించింది. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్లో పడి అభిమానులంతా కొన్నాళ్లు మన కుర్రాళ్ల ప్రతాపాన్ని మరచిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ వన్డే సిరీస్ పోరుకు ధోని సేన సిద్ధమైంది. బలహీనమైన వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి తమ నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. కనీసం వన్డేల్లోనైనా చెప్పుకోదగ్గ ఆటతీరుతో పరువు నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. గేల్ ఇప్పుడైనా... టెస్టు సిరీస్ ఆడిన వెస్టిండీస్ జట్టులో పలు మార్పులతో వన్డే టీమ్‌ను ఎంపిక చేశారు. టెస్టులతో పోలిస్తే పరిమిత ఓవర్లలో తమను తాము నిరూపించుకున్న కొంత మంది ఆటగాళ్లు జట్టులో ఉండటం విండీస్ బలం. ముఖ్యంగా కెప్టెన్ డ్వేన్ బ్రేవో వన్డేల్లో కీలకమైన ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నాడు. ధాటిగా ఆడే ఓపెనర్ జాన్సన్ చార్లెస్‌కు కూడా చోటు దక్కింది. ఐపీఎల్ స్టార్లు సునీల్ నరైన్, జాసన్ హోల్డర్లు టీమ్‌లో ఉన్నారు. సీనియర్లలో శామ్యూల్స్, స్యామీ, రామ్‌దిన్ వన్డే టీమ్‌లోనూ స్థానాలు నిలబెట్టుకోగలిగారు. అయితే వెస్టిండీస్ విజయావకాశాలు మరో సారి స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌పైనే ఆధార పడి ఉన్నాయి. టి20 లీగ్‌ల్లో విధ్వంసం సృష్టించే గేల్ సొంత జట్టుకు ఎప్పుడూ ఉపయోగపడలేదనే అపవాదు ఉంది. ఈ సారి టెస్టు సిరీస్‌తో అది మరో సారి నిరూపితం అయింది. మరి వన్డేల్లో ఏం చేస్తాడో చూడాలి. అందరూ స్టార్లే... చాలా కాలంగా వన్డేల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న నంబర్‌వన్ భారత్ కోణంలో చూస్తే ఈ సిరీస్ కూడా జట్టు ఖాతాలోకి పడేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ ధోని స్ఫూర్తిదాయక నాయకత్వంలో యువ ఆటగాళ్లందరూ ఇప్పటికే తమ సత్తా చాటుకున్నారు. రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రైనాలతో జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. టెస్టుల్లో లేని జడేజా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆసీస్‌తో ఘోరంగా విఫలమైన యువరాజ్‌కు మాత్రం ఇది పరీక్షా సమయం. విండీస్ కనీస ప్రతిఘటన ఇస్తుందా...లేక భారత్‌కు కొత్త రికార్డులు అప్పజెపుతుందా అన్నది ఆసక్తికరం. ‘తాగి ఉన్నారేమో’ మరో వైపు టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆటతీరుపై ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తీవ్ర విమర్శలు చేశారు. టి20 మత్తులో జట్టు ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ...‘ఇంకా దానిని మత్తు అనుకుందామా...నాకు తెలిసి వారు టి20లను తాగి అందులోనే మునిగిపోయారేమో’ అని లాయిడ్ అన్నారు. సచిన్ పెవిలియన్... కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని పెవిలియన్‌కు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. తొలి వన్డే సందర్భంగా బుధవారం ఈ స్టాండ్‌ను భారత కెప్టెన్ ధోని ఆవిష్కరిస్తాడు. మరో వైపు మ్యాచ్‌లో ఆడేందుకు వెస్టిండీస్ టీమ్ మంగళవారం ఇక్కడికి చేరుకుంది. కేరళ సాంప్రదాయ మోహినీ అట్టం, కథాకళి నృత్యాలతో వారికి ఆహ్వానం లభించింది. వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే నవంబర్ 21 కొచ్చి రెండో వన్డే నవంబర్ 24 విశాఖపట్నం మూడో వన్డే నవంబర్ 27 కాన్పూర్ రెండేళ్ల క్రితం ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 4-1తో విండీస్‌ను చిత్తు చేసింది. -
రాణించిన గేల్, శామ్యూల్స్
కోల్‌కతా: ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ (48 బంతుల్లో 58; 11 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (47 బంతుల్లో 58; 9 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించగా చివరి రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గేల్ ఈసారి ఆకట్టుకున్నాడు. దినేశ్ రామ్‌దిన్ (53 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్) నిలకడగా ఆడాడు. పీయూష్ చావ్లాకు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకుముందు 206/5 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన యూపీ 372/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. పర్వీందర్ సింగ్ (112; 17 ఫోర్లు; 2 సిక్స్) శతకాన్ని సాధించాడు. ఆమిర్ ఖాన్ (128 బంతుల్లో 47; 7 ఫోర్లు), పీయూష్ చావ్లా (58 బంతుల్లో 46; 9 ఫోర్లు) చివర్లో రాణించారు. పెరుమాల్, కాట్రెల్ లకు మూడు, బెస్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాన్పూర్‌లో భారత్, విండీస్ మూడో వన్డే న్యూఢిల్లీ: భారత, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ కాన్పూర్‌లో జరుగనుంది. ‘ఈనెల 27న జరిగే వన్డే మ్యాచ్ వేదికను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ నాతో చెప్పారు’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. -
దీటుగా ఆడుతున్న యూపీ
కోల్‌కతా: భారత్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టును ఉత్తర ప్రదేశ్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పర్వీందర్ సింగ్ (101 బంతుల్లో 78 బ్యాటింగ్; 11 ఫోర్లు; 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఈ మూడు రోజుల మ్యాచ్‌లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి యూపీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగులు సాధించింది. ఓపెనర్ ముకుల్ డాగర్ (74 బంతుల్లో 42; 8 ఫోర్లు) శుభారంభాన్నిచ్చాడు. 96 పరుగులకు నాలుగు వికెట్లు పడిన దశలో పర్వీందర్.. ప్రశాంత్ గుప్తా (86 బంతుల్లో 39; 6 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఓపిగ్గా విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. పెరుమాళ్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అంతకుముందు 333/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ 103.3 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటయింది. సీనియర్ బ్యాట్స్‌మన్ చందర్‌పాల్ (153 బంతుల్లో 112; 15 ఫోర్లు; 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. దేవ్ నారాయణ్ (129 బంతుల్లో 94; 10 ఫోర్లు; 2 సిక్స్) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు 197 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇంతియాజ్ అహ్మద్ వీరిని ఎల్బీగా అవుట్ చేశాడు. చివర్లో టినో బెస్ట్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు; 3 సిక్స్) రెచ్చిపోవడంతో జట్టుకు వేగంగా పరుగులు వచ్చాయి. ఇంతియాజ్ ఐదు వికెట్లు, ఆర్పీ సింగ్ మూడు వికెట్లు తీశారు.